కనువిందు లో సోషియల్ మీడియా టాప్`

జనాస్త్రం ప్రతినిధి మారంరెడ్డి జనార్దన రెడ్డి
——————————
* సెల్ చేతి లో ఉన్న ప్రతి భక్తుడు వీడియో గ్రాఫర్
* లక్షల మందికి చేరిన వీడియోలు
* 30 లక్షల మందికి పైగానే చేరాయి
* హాట్స్ఆఫ్ సోషియల్ మీడియా
——————————–


సౌత్ ఇండియా లోని అతి శక్తివంతమైన అహోబిలం నరసింహస్వామి ఆలయం లో జరిగిన బ్రహ్మోత్సవాలను హైలైట్ చేయడం లో సోషియల్ మీడియా టాప్ లో ఉన్నట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. దాదాపు15 రోజులు పాటు బ్రహ్మోత్సవాలు జరుగ్గా మొదటి రోజు నుంచి సోషియల్ మీడియాలో ప్రచారం ఆరంభమైంది.కొన్ని లక్షలు మందికి స్థానికంగా తీసిన వీడియో,ఫోటో లను సోషల్ మీడియా మిత్రులు ఫార్వర్డ్ చేసారు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాకుండా కర్ణాటక,తమిళనాడు,మహరాష్ట్ర,తెలంగాణ, భక్తులు ప్రతి రోజు వేలల్లో రాగ ,దేశం లోని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈసారి అహోబిలం కు రావడం జరిగింది.దీంతో జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కనువిందు చేశాయి.అహోబిలం బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవలు సాయంత్రం ఆరంభమై రాత్రితో ముగుస్తాయి.ఒక్క రథం వేడుక మాత్రం ఉదయం పూట జరుగుతుంది.ఇక్కడ కూడా భక్తులు వదలలేదు..కొన్ని సేవలు ఐతే లైవ్ కవరేజ్ లను కూడా సోషియల్ మీడియాలో ఇచ్చారు.గతం కంటే భిన్నంగా ప్రింట్ మీడియా స్టోరీలు,స్పాట్ లు ఇవ్వగా,ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా కవరేజ్ నీ ఇచ్చారు.ఈసారి జనాస్త్రం యూట్యూబ్ చానల్ (6లక్షలు వివర్స్) కూడా శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రతి రోజు ఒకటి,రెండు స్టొరీ ఇస్తూ భక్తుల మన్నలు పొందింది.మొత్తం మీద సోషియల్,ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియాలు పోటీ పడడంతో అహోబిలం బ్రహ్మోత్సవాలకు రాలేని భక్తుల దగ్గరికి ఉత్సవాలను చేర్చి కనువిందు చేశాయి.నరసింహ స్వామి ఆశీస్సులు, ఇలా కవర్ చేసిన ప్రతి ఒక్కరికి లభిస్తాయని జనాస్త్రం ఆశిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *