జనాస్త్రo ప్రతినిధి మారం రెడ్డి జనార్దన రెడ్డి
$ దేశంలో చక్రం తిప్పనున్న వాసు
$ టిడిపి అగ్రనేతల సమక్షంలో వాసుకు దేశం తీర్థం
$ నామినేటెడ్ పోస్టుకు హామి ?
$ ఉన్నత స్థాయిలో ప్రముఖులతో రాజకీయ, అధికార సంబంధాలు
$ స్వశక్తితో ఎదుగుదల
గత రెండు దశాబ్దాల నుంచి ఆళ్లగడ్డ రాజకీయంలో అంతర్గతంగా చక్రం తిపిన చింతకుంట శ్రీనివాస రెడ్డి (వాసు) ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పే యోచనలో ఉన్నారు. గురువారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షడు అచ్చం నాయుడు, మాజీ మంత్రులు భూమా అఖిల ప్రియ, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితరుల సమక్షంలో టిడిపి తీర్థం తీసుకున్నారు.
ఆళ్లగడ్డ మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వాసు ఆళ్లగడ్డ దివంగత ఎమ్మెల్యే సిపి తిమ్మరెడ్డి మనవడు. పంజాబ్‌లో డిజిపి హోదాలో పని చేసిన సీతరాం రెడ్డికి, ఆళ్లగడ్డ సమితి, మండలాద్యుక్షుడి గా పనిచేసిన మద్దిలేటి రెడ్డి, శంకర్ రెడ్డిలకు అన్న అయిన న్యాయవాది రామకృష్ణారెడ్డికి తనయుడు. ఈయన 2004లో తమ సమీప బంధువు భూమా నాగిరెడ్డితో విభేదించి గంగుల ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలతో చేతులు కలిపి తమ బంధువులతో దూరమై రాజకీయం నడిపారు. వాసు వ్యూహాలను మెచ్చి అప్పటీ కాంగ్రెస్ హాయంలో కాటన్ బోర్డు మెంబర్‌గా కాంగ్రెస్ అదిష్టానం నియమించింది. అప్పటి నుండి ఇప్పటీ వరకు కేంద్రం, రాష్ట్రంలోని మంత్రులతోనూ ఐపిఎస్, ఐఏఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ న్యాయం కోసం తిరిగే పేదలకు అండగా నిలిచి ముందుకు సాగుతున్నారు.
ఆరు మాసాల క్రితం నుంచి పాత వైరం విరమించుకొని తమ సమీప బంధువు మాజీ మంత్రి అఖిల ప్రియతో రాజకీయలను ఆరంభించినట్లు తెలుస్తొంది. గత రెండు రోజుల నుంచి వాసును టిడిపిలో చేర్చుకోవడానికి అఖిల ప్రియ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈయన అభిమానించే మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డిని పార్లమెంట్ టిక్కెట్ టిడిపిలో దక్కేవిధంగా కృషిచేసే అవకాశం లేకపోలేదని తెలుస్తొంది. ఇందుకు పార్టీ ఎంత మాత్రం సహాకరిస్తోందో తెలియదు. అయితే పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వాసు అనుచరులకు చెబుతునట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో కుడా పార్టీ బలోపేతంకు తిరగాలని పార్టీ అధినేతలు వాసుకు సూచించినట్లు తెలుస్తొంది. ఏది ఏమైనా చొరువ … ధైర్యంతో పైకి వచ్చిన వాసు రాజకీయాల్లో ఇంతవరకు తన సొమ్మునే నష్టపోయి ఉంటారని ఇప్పుడైనా తెలుగుదేశం అధికారంలోకి వస్తే చట్ట సభలోనికి వెళ్లే పోస్టు ఇవ్వాలని వాసు అనుచరులు కోరుతున్నారు.