అహోబిల పవిత్రమాలకు యమా క్రేజ్..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

♦అహోబిల పవిత్రమాలకు యమా క్రేజ్..
♦ఇప్పటికే పూజలందుకుంటున్న మాలలు…
♦తొమ్మిది క్షేత్రాలలో వేలాదిమాలలకు పూజలు ….
♦అక్టోబర్ 23 న పవిత్రమాలలు పంపిణి ……


దేశంలోనే అత్యంత శక్తివంతమైన అహోబిల క్షేత్రంలో ప్రస్తుతం పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈనెల 22 వ తేదీకి ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలలో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాలలో తొమ్మిది నరసింహస్వామి ఆలయాలలో దాదాపు పదివేల మాలలు స్వామి మెడలో వేసి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఈ మాలకు నరసింహస్వామి బక్కతులలో ఏంతో క్రేజిఉంది. ఆలయ ప్రదానాక్షకులు కే.పి రమేష్ చేతులమీదుగా మాలను అందుకుంటే ఎంతో అదృష్టమని, భక్తులు బావిస్తారు. ఈ మాలను ఇంటి ముఖద్వారానికి గానీ, దేవుని మూలకు గానీ కట్టుకుంటే అరిష్టం ఉండదని కారుకు, లారీలకు, ఇతర వాహనాలకు కట్టుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని సెంటిమెంట్ ఉంది. దీనితో ఈ మాలలు తమకు కావాలంటే, తమకు కావాలంటూ ఆలయ పూజారులకు, సిబ్బందికి చాలామంది భక్తులు చెప్పుకుంటున్నారు. వి.ఐ.పి లు ఆలయాలు సందర్శించినప్పుడు వారికి గౌరవంగా ఈ మాలను సత్కరిస్తారు. ఆలయానికి అదికసంఖ్యలో వచ్చే తమిలనాడు, కర్నాటకు, తెలంగాణా భక్తులు కూడా మాలను పొందాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంమీద అహోబిలం పవిత్రమాలకు ప్రత్యేక క్రేజీ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *