ఆదేవాలయంలో హిందూ సిద్దాంతాలకోసం యుద్దమే !! కట్టుబొట్టుకు అదిక ప్రాధాన్యత…

జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

*** హిందూ సిద్దాంతాలకోసం యుద్దమే !!
*** కట్టుబొట్టుకు అదిక ప్రాధాన్యత…..
***మొడ్రన్ దుస్తులు వద్దే వద్దు…….

***అనుమతించడం కోసం మేమే దుస్తులు ఇస్తున్నాం………

ప్రపంచంలోనే రెండో దేవాలయంగా నాలుగు దశాబ్దాలనుంచి శ్రీ జగజ్జననీ మాతా ఆలయంలో హిందూ సిద్దాంతాలు అమలు చేయడానికి కొన్ని సందర్బాలలో ఆలయ సిబ్బంది, పూజారులు, నిర్వహుకులు పాశ్చాత్య సాంస్కృతిలో దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులతో యుద్దం చేయాల్సి వచ్చింది. దేశంలోనే దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన భక్తులు ఏడాదిలో లక్ష మందికి పైగా ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ జగజ్జననీ ఆలయం సందర్శించి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయములో కొందరు భక్తులు ముఖ్యంగా మహిళలు, యువతులు, యువకులు మాడ్రన్ డ్రస్ లలో అమ్మవారి దర్శనానికి వస్తే వారిని దర్శనానికి అనుమతించడంలేదు. దీనితో భక్తులు ఆలయ నిర్వహులు శివ నాగ పుల్లయ్య, నారాయణ తదితరులపై, మాడ్రన్ దుస్తులు వేసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలయ సిబ్బంది సంయమనం పాటిస్తూ తమదగ్గరే దర్శనానికి అవసరమైన దుస్తులు ఉన్నాయని వాటిని ఉచితంగా అందజేస్తామని చెప్పినా వారు వినడం లేదు. మేము వచ్చిన డ్రస్ లోనే అమ్మవారిని దర్శనం చేసుకుంటామని మొరాయిస్తున్నారు. మహిలలు జడలోనే రావాలని చీరతో పాటు రవిక, నుదుట పై కుంకుమ బొట్టు ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ సిబ్బంది వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం 12 గంటలపాటు పదిమంది సేవకులు కూడా పని చేస్తున్నారు. ఆలయంలోకి సెల్ ఫోన్ లను, డిజిటల్ చేతి వాచీలకు కూడా ఆలయంలోకి అనుమతించడంలేదు. వీటిని ఆలయ సిబ్బంది ఉచితంగా బద్రపరుస్తున్నారు.
మొరాయించే వారి సంఖ్య తగ్గింది …… శివనాగ పుల్లయ్య
ఆలయ నిర్వహుకులలో ఒకరైన శివనాగ పుల్లయ్య మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలనుంచి ఆలయ నిబందనల మేరకు భక్తులు సందర్శిస్తున్నారని గతంలో నూటికి ముప్పైమంది భక్తులు మొడ్రన్ దుస్తులలో వచ్చి ఇబ్బందులు పెట్టేవారు. భక్తులకు నచ్చచెప్పుతూ రావడంతో ఇప్పుడు నూటికి ముగ్గురు మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారని వారికి కూడా నచ్చ చెప్పుతుండంతో అనుకూలం అవుతున్నారని అన్నారు. అన్నిపూజలు ఉచితంగా నిర్వహించడమే కాకుండా ఉచి త అల్పాహారము, బోజనము కల్పిస్తున్నామని అందువల్ల హిందూ కట్టు, బొట్లతోనే అమ్మవారికి సందర్శించమని పదే పదే కోరుతున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *