♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔సస్పెన్స్‌కు తెర దించిన జగన్
⇔జిల్లాలో జగన్ నోటితో రామిరెడ్డి పేరు ప్రకటన
⇔ప్రత్యర్థులు ఇచ్చే డబ్బులు తీసుకొండి
⇔రామిరెడ్డి అన్నకు ఓటు వేయండి
⇔జన సమీకరణలో తనయుడు ఓబుల్ రెడ్డి సత్తా
వైయస్ఆర్సిపి అభ్యర్థి ప్రకటనలో పరోక్షంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముందున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని నందికొట్కూర్ మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలనే బరీలో దించాలని ముఖ్య మంత్రి జగన్‌మోహన్ రెడ్డి యోచిస్తున్నారు. అయితే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. బనగానపల్లె ఎమ్మెల్యే రామిరెడ్డిని తిరిగి రంగంలోకి దించే అవకాశం లేదని నంద్యాల నుంచి కానీ పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిని బనగానపల్లె నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు ప్రచారం సాగింది. అయితే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నందికొట్కూర్ మినహాయిస్తే మిగిలిన చోట్ల పాత అభ్యర్థులనే పోటీ చేసే విధంగా సూచనలు సలహాలు ఇచ్చినప్పటికి బనగానపల్లె విషయంలో మరో అభ్యర్థి వస్తున్నారని ప్రచారం సాగించారు. అయితే గురువారం బనగానపల్లెకు వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మీ అభ్యర్థి రామిరెడ్డికి ఓటు వేస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంతోనే అభ్యర్థిని ప్రకటించినట్లు అయ్యిందని కార్యకర్తలలో అభిమానూల్లో నూతనోత్సహం వెల్లువెత్తింది. ప్రత్యర్థి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయని ఓటుకు రూ.2000 నుంచి రూ.3000 ఇస్తారని ఈ మొత్తాన్ని సంతోషంగా తీసుకొని రామిరెడ్డి అన్నకు ఓటు వేసి మద్దత్తు ప్రకటించాలని జగన్ చెప్పడంతో సభికుల నుంచి హర్షధ్వనాలు మిన్నుముట్టాయి. తన సత్త ఎమిటో చూపించుకోవడానికే పట్టుబట్టి ఈనెల 4వ తేదని జరగాల్సిన సభ రద్దు అయినప్పటీకి 14వ తేదికి బనగానపల్లెకు జగన్ వచ్చే విధంగా చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. జనాల సమీకరణలో తనయుడు ఓబుల రెడ్డి భార్య జయమ్మ, కొడలుతో పాటు జడ్పి ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు కీలక భూమికను పొషించారు.