విశ్వంకు ..ఫరూఖ్ ..రెండో సారి..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

గృహా ప్రవేశంకు ఫ‌రూక్ జ‌ల‌క్కు

భూమా బ్ర‌హ్మానంద రెడ్డి హ‌జ‌రు

ఎంపీ పోచా, శిల్పా ర‌వి, చ‌క్రంలు హ‌జరు

తెలుగుదేశం ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఫ‌రూక్ … నంద్యాల‌ ప‌ట్ట‌ణానికి చెందిన‌ ఒక రాజ‌కీయ ప్ర‌ముఖుడు నూత‌న గృహ‌ప్రవేశంకు జ‌ల‌క్కు ఇవ్వడం స్థానికంగా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నంద్యాల ప‌ట్ట‌ణంలోని న‌ర‌హారి విశ్వ‌నాథ్ రెడ్డి అనే వ్యాపారి 20 సంవ‌త్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఫ‌రూక్ అనుచ‌రుడిగా కొన‌సాగుతూ వ‌చ్చారు. ఆ త‌రువాత వైయ‌స్ఆర్సిపి తీర్థం పుచ్చుకొని శిల్పా మోహ‌న్ రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి అనుచ‌రుడిగా కొన‌సాగుతున్నారు. అయితే బుధ‌వారం నంద్యాల ప‌ట్ట‌ణంలోని ఎస్‌బిఐ కాల‌నీ నిర్మించిన గృహా ప్ర‌వేశ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలో ఉన్న ఫ‌రూక్‌ను, భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆహ్వానం కోసం నాలుగు రోజుల క్రితం ఫ‌రూక్ ద‌గ్గ‌రికి విశ్వం వెళ్ళారు. అప్పుడు ఇరువురు ఐదేళ్ల త‌రువాత మ‌న‌స్సు విపి మాట్లాడుకున్నారు. దీంతో గృహా ప్ర‌వేశం త‌రువాత విశ్వం ఫ‌రూక్ ఆధ్వ‌ర్యంలో టిడిపిలోకి తిరిగి వెళ్తార‌నే ప్ర‌చారం కొన‌సాగింది. అయితే ఫ‌రూక్ త‌ప్ప ఎమ్మెల్యేలు శిల్పా ర‌విచంద్ర‌కిషోర్ రెడ్డి, చ‌క్ర‌పాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, దేశం సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు హ‌జ‌రైయ్యారు. చివ‌రికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి కుడా వేడుకకు హజ‌రైయ్యారు. ఇంత మంది హ‌జరైనా ఒక ఫ‌రూక్ హ‌జ‌రుపై ఉత్కంఠ‌త నెల‌కొంది. నంద్యాల ప‌ట్ట‌ణంలోనే వివిధ కార్య‌క్ర‌మాల్లో ఫ‌రూక్ పాల్గొంటూ ఇక్క‌డికి వెళ్లలేదు. గ‌తంలో 6, 7 సంవ‌త్స‌రాల క్రితం ఫ‌రూక్ వెంట‌నే విశ్వం ఉన్నప్పుడు కుడా గృహా ప్ర‌వేశానికి ఫ‌రూక్ జ‌ల‌క్కు ఇచ్చారు. దీంతో రెండ‌వ సారి విశ్వం ఇంటికి ఫ‌రూక్ హజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నియంశం అయ్యింది.

గృహా ప్ర‌వేశానికి ముందే ఫ‌రూక్ మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా విశ్వాన్ని టిడిపిలోకి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తొంది. అందుకు విశ్వం సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఫ‌రూక్ మ‌న‌స్సు నొచ్చుకొని గైర్హ‌జ‌రయ్యారని అనుకుంటున్నారు. అంతేకాక తెలుగుదేశం అధికారంలో మంత్రిగా ఫ‌రూక్ ప‌నిచేసిన స‌మ‌యంలో విశ్వానికి అధిక ప్ర‌ధాన్య‌త ఇచ్చిన విష‌యం కుడా ఫ‌రూక్ అనుచ‌రుల‌తో చెబుతునట్లు తెలుస్తొంది. విశ్వం కుడా ఫ‌రూక్‌ను అడ్డం పెట్టుకొని పైర‌విలు చేసి సంపాదించుకోలేద‌ని ఆయ‌న‌కు దూర‌మైన మ‌నుషుల‌ను ద‌గ్గ‌రికి చేరుస్తూ సేవలు చేశార‌ని విశ్వ‌నాథ్ రెడ్డి అనుచ‌రులు పేర్కొంటున్నారు. అయితే ఒక ర‌కంగా ఫ‌రూక్ హ‌జ‌రై ఉంటే విశ్వం టిడిపిలో చేరే విష‌యం పై పునఃరాలోచించే వారిని ఇప్పుడు అవ‌కాశం లేకుండా పొయింద‌ని అంటున్నారు. మొత్తం మీద శిల్పా వాళ్లు కుడా ఫ‌రూక్ హ‌జ‌రైతే విశ్వం ఎలా మొగ్గుచుపుతారోన‌న్న అనుమానం ఉండేది. ఇప్పుడు అనుమానానికి తెర ప‌డిన‌ట్లు అయ్యిందని విశ్వం ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఎంత‌కాలమో వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *