సీమ పోలీసు అధికారికి ఎలక్షన్ ఫీవర్ …..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

$ సీమ పోలీసు అధికారికి  రెండు ప్రధాన పార్టీల బంపర్  ఆఫ‌ర్‌

$ క‌ర్నూలు పార్ల‌మెంట్ కానీ

$ అనంత‌పురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నుంచి

$ అవున‌ని … కాద‌ని చెప్ప లేని స్థితిలో అధికారి

$ గ‌తంలో జాప్యం చేసి ఓట‌మి

సీమలో పనిచేస్తున్న ఓ పోలీసు అదికారిని తమపార్టీ తరుపున పోటీచేయాలని రెండు ప్రదాన పార్టీలనుంచి వత్తిడి ఉన్నట్లు సమాచారం .ఉన్నత స్థాయి నాయకులు నేరుగా ఈ అధికారితో సంప్రదింపులు చేశారా లేకా ద్వితీయ శ్రేణి నాయకులు చర్చలు జరిపారా అనేదానిపై మిస్టరీ వీడాల్సి ఉంది…మొత్తం మీద వాల్మీకులు అదికంగా ఉన్న అసెంబ్లీనుంచి కాని ఎంపి గా గానిపోటీ చేయడానికి రెడీగా ఉండాలనే సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది..జనాస్త్రం కు ఉన్న సమాచారం మేరకు టిడిపి అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి రాయ‌ల‌సీమ‌లోని ఒక పోలీసు అధికారి రెడిగా ఉండాల‌ని ఆ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం నుంచి సంకేతాలు అందిన‌ట్లు స‌మాచారం. క‌ర్నూలు పార్ల‌మెంట్‌లో అత్య‌ధికంగా వాల్మీకి ఓట‌ర్లు ఉన్నారని వారి త‌ర‌ఫున అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు పోటీ చేస్తే బాగుంటుంద‌నిరాజకీయ పార్టీల అంచనా. గ‌తంలో ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన బిటి నాయుడు పోటీ చేయ‌గా ఈ సారి ఆయ‌నకు విశ్రాంతినిచ్చి పోలీసు అధికారిని బ‌రిలోకి దించుతే ఎలా ఉంటుంద‌ని అంశం పై చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లు తెలుస్తొంది. ఈ పోలీసు అధికారి గ‌తంలో అనంత‌పురం జిల్లాలో టిడిపి అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి ఉత్సాహం చూపారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ బిజేపితో పోత్తు క‌ల‌వ‌డంతో ఈ అధికారికి ఇష్టం లేకున్న రంగంలోకి దించ‌డంతో ఓట‌మి చ‌విచూసారు. ఇంకొ స‌మ‌స్య ఎమెచ్చిందంటే నామినేష‌న్ల ముందు ఈ అధికారిని హ‌రిబ‌రీగా దించ‌డంతో సంబంధిత అస్లెంబ్లీ, నియోజ‌క‌ర్గంలోని కొత్త కార్య‌క‌ర్త‌ల‌కు ద‌గ్గ‌ర కాలేక‌పోయ్యారు. ఈ జాప్యం కుడా అభ్య‌ర్థి పాలీట శాపంగా మారింది. అస‌లు విష‌యం ఏమంటే క‌ర్నూలు పార్ల‌మెంట్ నుంచి పోటీ చేయాల్సి వ‌స్తుంద‌ని చెప్పారే త‌ప్ప పోలీసు అదికారికి  పోటీ విష‌యంలో ఇప్ప‌టికి సందిగ్దంలోనే  ఉన్నట్లు స‌మాచారం. అవున‌ని ..కాద‌ని చెప్పే ప‌రిస్థితి ఇంత‌వ‌ర‌కు లేదు. క‌ర్నూలు పార్ల‌మెంట్ మిస్ అయితే అనంత‌పురం జిల్లాలో వాల్మీకులు అధికంగా ఉన్న అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవ‌కాశం కుడా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ఈ అధికారికి టిక్కెట్ ల‌భిస్తుందా లేదా అనే చ‌ర్చ పోలీసు వ‌ర్గాల్లో గుస‌గులాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *