జగజ్జనని ఆలయ చరిత్ర లో అరుదైన రికార్డు నమోదు చేసుకుంది…గత నెల జూన్ 26 తేదీ ఆలయం లో ఆషాఢ మాసం చీర, సారే వేడుకలను ఆరంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు కనీసం 10 వేల మందికి పైగా చీర, సారే వేడుకల్లో పాల్గొని తమ మొక్కుబడులు ను ఆలయ సంప్రదాయ లో దేశం లోని వివిధ రాష్ట్రాలనుంచి ప్రతి రోజు పాల్గొనడం ఒక ఎత్తు ఐతే రాష్ట్రo లోని వివిధ గ్రామాలకు,పట్టణాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చీర, సారే ను కోలాటాల మధ్యన ఆనందంగా సమర్పించు కొంటున్నారు.. ఈనెల 11,12,13 తేదీలు శుక్ర,శని,అది వారాలు రోజుకు కనీసం 20 వేల మంది భక్తులు హాజరై తమ మొక్కు బడులను తీర్చుకున్నారు..ఇందులో కుంకుమ అర్చన లు,వడి బియ్యం,హారతి దీపం వేడుకల్లో 15000 మంది పాల్గొన్నారని ఆలయ నిర్వాహకులు శివ నాగ పుల్లయ్య,నారాయణ లు అన్నారు…రోజుకు 16నుంచి 18 వేలమంది అన్నప్రసాదం ను స్వీకరించారని ఇది అరుదైన రికార్డు గా వారు పేర్కొన్నారు…ఈనెల 24 తేదీ రాత్రి ఆషాఢ మాసం పూజలు ముగుస్తాయి అని లోపల దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు 1.50 నుంచి 2లక్షల మంది భక్తులు పాల్గొంటారని అందుకు ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేసుకుంటున్నట్లు శివ నాగపుల్లయ్య,నారాయణలు తెలిపారు…