♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔విశ్రాంతిలో పరూఖ్.ప్రచారంలో బైరెడ్డి శబరి
⇔కొట్టాల శివుడు, తాతిరెడ్డి తులసిరెడ్డి,నరహరి విశ్వం ప్రచారం
మాజీమంత్రి పరూఖ్ కు ప్రమాదం జరగడంతో గత నాలుగురోజులనుండి కుంటుపడిన ప్రచారంను దూకుడు పెంచడం పై దృష్టిని సారించారు..పరూఖ్ కు రంజాన్ కు ఒకరోెజు ముందు కర్నూలు నంద్యాల జాతీయ రహదారిలో ప్రమాదం జరగడంతో ప్రచారంలో ఉదృతంగా పాల్గొంటున్న ఎన్ ఎండి పిరోజ్ వారి కుటుంబ సభ్యులు తాత్కాలికంగా వాయిదా వేశారు..పరూఖ్ కూడా కోలుకోవడంతో ఇప్పుడు నామినేషన్లకు సమయం స్వల్పంగానే ఉండటంతో తిరిగి దూకుడును పెంచారు..అయితే పార్టీలకు అతీతంగా పరూఖ్ ను పరామర్శించడంతో ఆపార్టీ నాయకులకు కూడా ఎంతో ధైర్యం ఇచ్చినట్లయింది..వైసిపిలో కీలక నేతలు కూడా ప్రమాదం కావడంతో పరామర్శించడంలో తప్పు లేదంటూ రాష్ట్ర మార్కొపెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మునిసిపల్ చైర్మన్ మాబున్నిసాతోపాటుగా పలువురు కౌన్సిలర్లు తదితరులు వచ్చి పరామర్శించారు..పరూఖ్ కోలుకోవాలని కోరారు..మొత్తంమీద ఇటువంటి సంఘటనల ద్వారా ఎంతో కొంత సానుభూతి కూడా పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..అయితే ప్రచారం కుంటుపడకుండా ఇటీవలనే వైసిపికి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిన నరహరి విశ్వనాదరెడ్డి ఆద్వర్యంలో పట్టణంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాయి..అంతేకాక టిడిపి అగ్రనేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎంపి అబ్యర్ధి శబరితోపాటు మాజీ జడ్ పి వైస్ చైర్మన్ కొట్టాల శివనాగిరెడ్డి, న్యాయవాది, రాష్ట్ర టిడిపి కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి తదితరులు కూడా గ్రామాలలో టిడిపిని గెలిపించాలంటూ ప్రచారాలు కొనసాగించారు..ఇకనుండి ఈ ప్రచారాలను మరింత ఉత్సాహంతో భారీ ఎత్తున జరిపి నామినేషన్ కు భారీ ఎత్తున జనం తరిలి వచ్చే విదంగా ప్రయత్నాలను ఆరంభించారు..