దేశం కుట్రలవల్లే రాయితీలు ఇవ్వలేకపోతున్నాం

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔టిడిపిపై వైసిపి అటాక్

⇔రాయితీ తీసివేయడంతో ఆందోళనలో కొనుగోలుదారులు

⇔కలెక్టరుకు పిర్యాదుతో రాయితీ రద్దు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ ఆర్ సిపి అభ్యర్థి శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి, తెలుగుదేశం అభ్యర్ధి మాజీ మంత్రి ఎన్ ఎండి పరూఖ్ లు ఓటరును తమవైపు తిప్పుకోవడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోవడంలేదు..ఇందులో భాగంగా శిల్పారవికి సంబందించిన శిల్పా సహకార్ లో సరుకులు కొనేవారికి గత దశాబ్దకాలంనుంచి పదిశాతం రాయితీ ఇచ్చేవారు..ఈ రాయితీ వల్ల ఓటర్లను ప్రభావితం చేస్తారని టిడిపికి చెందిన నాయకులు జిల్లా కలెక్టరుకు పిర్యాదు చేశారు..దీనితో జెసి రాహుల్ కుమార్ రెడ్డి విచారణ జరిపి ఎన్నికలు ముగిసేంతవరకు ఎలాంటి రాయితీలు ఇవ్వద్దని ఉత్వర్వలు జారీచేశారు..ఇదే అవకాశంగా భావించిన శిల్పారవి తమ సహకార్ సంస్ధ దగ్గర టిడిపి వారుపిర్యాదు చేయడంతో పది శాతం రాయితీ ఇవ్వలేక పోతున్నామని పెద్ద ప్లెక్సీని ఏర్పాటుచేశారు..అంతేకాకుండా ఉగాది,రంజాన్ తదితర పండుగలను చేసుకోవడానికి అన్ని కులాలు మతాలు సహకార్ దగ్గరికి పదిశాతం రాయితీ ఉందని వచ్చి సరుకులు కొనుగోలు చేయగా తాము మీకు సాయం చేస్తుంటే మా ప్రత్యర్ధులు అడ్డుకున్నారని ఎన్నికల నిభందనలను పాటించాల్పి ఉందని అందువల్ల ఇవ్వలేక పోతున్నామని వివరించారు..దీంతో మీరుమీరు రాజకీయంగా కొట్టుకోండి మాకొచ్చే బెనిపిట్ ను ఎలా దెబ్బతీస్తారని పలువురు హెచ్చరించారు..అంతేగాక శిల్పా సహకార్ ద్వారా కొంతమంది పేదలకు వారి పరిస్థితిన బట్టి నెలనెల ఉచితంగా సరుకులను రవి అందించే నిర్ణయం తీసుకున్నారు..ఈనిర్ణయం ఏమవుతుందోనని కూడా లబ్దిపొందే వారు ఆందోళన వ్యక్తంచేశారు..మొత్తం మీద ఇది ఎంతవరకు వైసిపికి ప్రయోజనం జరుగుతుందో పోలింగు రోజే తెలుస్తుంది..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *