♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔నంద్యాలలో చల్లా….కాటసాని రామిరెడ్డి చర్చలు
⇔పోచా కార్యాలయం వేదికగా కలిసికట్టుగా పనిచేస్తామని
⇔జగన్,రామిరెడ్డి,పోచా గెలుపులే మా లక్ష్యం
వరుసగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్న బనగానపల్లె ఎంఎల్ఎ, వైయస్ ఆర్ సిపిా అభ్యర్ధి కాటసాని రామిరెడ్డి శనివారం మరో సమస్యను కూడా పరిష్కరించారు..నంద్యాల పట్టణంలోని ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి కార్యాలయాన్ని వేదికగా చేసుకుని అవుకు రారాజులుగా గుర్తింపు పొందిన చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి,విఘ్నేశ్వరరెడ్డిల ఆద్వర్యంలో సమావేశాన్ని వైయస్ ఆర్ సిపి సమన్వయకర్త,ఎంఎల్ సి గుండ్లకుంట రామసుబ్బారెడ్డి చర్చలు జరిపారు..ఇరువురు చర్చలకోెసం ఎదురు చూస్తుండటంతో పెద్దగా వాదోపవాదాలు వివాదాలతో సంభందం లేకుండా సమసిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఓటు, వైసిపి కి అనుకూలంగా ఉండే ప్రతి నాయకుని సహకారం తీసుకుంటానని పోలింగులో వారు పడిన కష్టానికి గుర్తించి వారికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇస్తానని కాటసాని రామిరెడ్డి చల్లా సోదరులకు వివరిాంచారు..చల్లా సోదరులు కూడా తాము వైసిపికి మద్దతు ఇచ్చి తీరుతామని తమ ప్రాధాన్యత తమకు ఉండాలని సమావేశం దృష్టికి తెచ్చారు..తమకు ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఇచ్చిన గుర్తింపును ఈ సందర్బంగా వారు గుర్తు చేసుకున్నట్లు సమాచారం..మా అన్న రామకృష్ణారెడ్డికి ఎంఎల్ సి పదవి ఇచ్చారని ఆతరువాత ఆయన మృతి చెందడంతో భౌతికకాయాన్ని చూడటానికి సిఎం వచ్చారని ఆ తరువాత మరిచిపోకుండా తిరిగి చల్లా భగీరధరెడ్డికి ఎంఎల్ సి ఇచ్చారని ఆయన మృతిని తట్టుకోలేక మాస్వగృహానికి వచ్చి పరామర్శించారని ఇటువంటి వాటిని మేము ఎలా విస్మరిస్తామని చల్లా రాజశేఖరరెడ్డి అన్నారు..మేము ఎన్ని ఇబ్బందులు,కష్టాలు పడుతున్నా నీతి నిజాయితీతో రాజకీయం చేస్తామని వివరించారు..మొత్తం మీద చల్లా కుటుంబ సభ్యులను సంతృప్తి పరిచే విదంగా జరిగాయి..ఈకార్యక్రమంలో చల్లా కుటుంబీకులు సూర్య ప్రకాష్ రెడ్డి ,విఘ్నేశ్వరరెడ్డి, రాజశేఖరరెడ్డి, రఘనాదరెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు..చల్లా కుటుంబ ఆత్మీయుడిగా నంద్యాలపట్టణంలో పిలిచే ఉయ్యలవాడ వెంకటేశ్వరరెడ్డి ఎంఎల్ఎ రామిరెడ్డితో సెల్పీ తీసుకుని సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.