బుడ్డా…మైక్రోలెవల్ అలర్ట్..

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* మైక్రో లెవల్లో బుడ్డా అవగాహన
* షాక్ కు గురిఅవుతున్న అధికారులు
* సుఖంగా భక్తులు ఇంటి కి చేరుకోవాలి
* మీకు .. నాకు నిద్ర ఉండదు
* చేత కాకుంటే ఫ్రెండ్లీ గా తప్పుకొండి
* సీరియస్ గా కాదు..ఫ్రెండ్లీ జాబ్ చెయ్యండి _బుడ్డా

మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు….శ్రీశైలం బ్రహ్మో త్సవాలు విజయవంతంగా జరుపాలి.మీ పని తనం అప్పుడే బయట పడుతుందని టైంల్లీ లీడర్,శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి  తరుచూ జరుగుతున్న సమావేశాలలో హెచ్చరిస్తున్నారు…ఉత్సవాలు ముగిసే వరకు నాకు నిద్ర ఉండదు..మీకు నిద్ర ఉండదు. ఉత్సవాలు ముగిసిన వెంటనే రెండు కాకుంటే మూడు రోజులు రెస్ట్ ఐనా తీసుకుందాం..సంపూర్ణంగా నిద్ర పోదాం అనడంతో అధికారులు కూడా ఉరుకులు పరుగులు తీస్తున్నారు.ఒక వేళ ఎవరైనా కష్ట పడటం సాధ్యం కాదు అంటే మీ ఉన్నతాధికారులకు చెబితే వారే మీకు విశ్రాంతి ఇస్తారు..బాగా పని చేసే వారు వస్తారు.. పది రోజులు పాటు ఫ్రెండ్లీ జాబ్ చెయ్యండి..మీకు శివయ్య ఆశీస్సులు లభిస్తాయి.కాలి నడక బాట తో పాటు ప్రధాన రహదారిలో చిన్న సంఘటన కూడ జరుగవద్దు..భక్తుడు ఇంటి దగ్గర నుంచి ఎలా శ్రీశైలం కు వస్తాడో అలానే ఇంటికి చేరుకోవాలి అదే మన అందరి లక్ష్యం అని అధికారులకు బుడ్డా సూచిస్తున్నారు.

బుడ్డా ప్రశ్నలకు నివ్వెరపోతున్న అధికారులు

అధికారుల రివ్యూ మీటింగ్ లో భక్తులు ఎక్కడ యిబ్బంది పడేది ..శివరాత్రి రోజు ఎక్కడ భక్తులు రద్దీగా ఉంటారు,రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఎమ్మెల్యే చెబుతుంటే అధికారులు నోరు వెళ్ళబెడుతున్నారంటే  మైక్రో లెవల్లో ఎంత సమాచారం ఎమ్మెల్యే తెప్పించుకున్నది మీటింగులో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.నడక ప్రాంతం లో వెంకటాపురం నుంచి కైలాస ద్వారం వరకు 46 కి.మీ పొడవున కూడా ఇబ్బందులు,అతి ప్రమాదాలు ఎక్కడ జరుగు తాయి..మీరు తీసుకుంటున్న చర్యలు ఎంటి అంటూ బుడ్డా అధికారులను గట్టిగా అడుగుతున్నారని వారు జనాస్త్రంకు వివరిస్తున్నారు.మనం అనుకున్న చోట అప్రమత్తంగా ఉండాలి..ఐతే అనుకొని చోట కూడా సంఘటనలు  జరుగవచ్చు..అక్కడ కూడా సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలి.పదిలక్షల మంది భక్తులకు ధైర్యం ఇవ్వాలంటే మైక్రో లెవల్లో అవగాహన ఉండాలని అధికారులకు బుడ్డా వివరించడం అధికారులు కంటికి నిద్రలేకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు..కాలిబాటలో 45 ఏళ్ల లోపు వయస్సున వారే విధులు స్పీడుగా నిర్వహిస్తారని కూడా బుడ్డా ఆలోచన..మొత్తం పెద్దగా తెలియదులే అనుకొని మీటింగ్ కు వెళ్లిన అధికారులు ఎమ్మెల్యే బుడ్డ సంధిస్తున్న అస్త్రాలకు నివ్వెర పోయి,తమ పరిధిలో అన్నీ తెలుసుకొని నివేదికలను సిద్దం చేసు కుంటున్నారు.
ఎమ్మెల్యే బుడ్డా కష్టం మేరకు ఎక్కడ చిన్న సంఘటన జరుగకుండా చూడాలని శివాయ నమః అనుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ తో భక్తులకు స్వాగతం పలుకుదాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *