జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
!ముచ్చమటలు పోయిస్తున్న గంగుల
!ఇంతకు ఏ పార్టీ నుంచి భరీలోకి దిగబోతున్నారు
!గ్రేటర్ రాయలసీమ సమస్యలు అజెండా
!ఆరు జిల్లాలకు కృష్ణ జలాలే నా ప్రధాన అజెండా
!2024లో పోటీలో ఉండి తీరుతా
! యువకుల కంటే ముందుగా పరిగెడుతున్న గంగుల
జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సీమ రాజకీయ నాయకుల్లో గంగుల ప్రతాప్ రెడ్డి ఒకరు. ఈయన ఆళ్లగడ్డ నియోజకర్గం ఎమ్మెల్యేగానూ, నంద్యాల ఎంపీగానూ రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికై 30 నుంచి 40 సంవత్సరాల పాటు చట్టసభల్లో చక్రం తిప్పిన నేత. రాయలసీమ సమస్యల పై ముఖ్యంగా కృష్ణ జలాల పంపిణీ పై సంపూర్ణ అవగహన కలిగిన అతి స్వల్ప సంఖ్య కలిగిన నాయకుల్లో ప్రతాప్ రెడ్డి ఒకరు. వయస్సు అధికంగా ఉన్న యువకులతో పోటీపడుతూ రెండు మాసాల తరువాత జరిగే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఏ గుర్తింపు కలిగిన ప్రధాన పార్టీ టిక్కెట్ ఇచ్చిన పోటీ చేస్తానని లేని పక్షంలో ఆళ్లగడ్డ అసెంబ్లీకి కానీ, నంద్యాల పార్లమెంట్‌కు కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఆళ్లగడ్డ పెద్దాయనగా పిలిచే గంగుల ప్రతాప్ రెడ్డి స్థానిక సమస్యలతో పాటు కృష్ణ జలాలు గ్రేటర్ రాయలసీమకు అందించాలనే లక్ష్యంతో పోటీ చేయబోతున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధిస్తే ప్రజా సమస్యలను సభ దృష్టికి తేగలనని కుండా బద్ధలు కొట్టి చెపుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూర్, శ్రీశైలం, బనగానెపల్లె, నంద్యాల, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన బరిలోకి రావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరి ఓట్లు చీల్చి విజయం సాధిస్తారోనన్న భయం వారిని వెంటాడుతున్నది. ముక్కు సూటిగా పోయ్యే ప్రతాప్ రెడ్డి ఒక్కొక్క సారి ఎవరు చెప్పిన వినని నైజం .. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే మానుకోవడం చాల కష్టం .అందువల్ల బలమైన వర్గం కలిగిన ప్రతాప్ రెడ్డిని యుద్ధంలో నుంచి ఉపసంహరించడం చాల కష్టమని విజయమో వీర స్వర్గమో తేల్చుకునే వ్యక్తి కావడం వల్లే జాతీయ స్థాయి గుర్తింపు పొందారని రాజకీయ విశ్లేషకుల అంచన. ఇటీవల ఆయన ఇస్తున్న యూట్యూబ్ మీడియా ఇంటర్‌వ్యూలు వైరల్ కావడం వెనుక ఆయన చెప్పే అంశాల పై ఆసక్తి ఎంత అన్నది తెలుస్తుంది… గంగుల చాల లోతైనా రాజకీయ నాయకుడు ఆయన అంతరంగం పసిగట్టడం ఎంతో కష్టం .ఏదో ఓక ప్రధాన పార్టీలో గట్టి హామితోనే బరిలోకి దిగుతున్నారనే అంచన కుడా రాజకీయ వర్గాల్లో ఉంది. మొత్తం మీదా ఆయన పోటీ పై సర్వత్ర చర్చలు సాగుతున్నాయి.