జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నంద్యాల, ఆగస్టు 12:-
ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, పేర్కొన్నారు.
మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని పురస్కరించుకొని టేక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని… ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాధలను గుర్తుచేసుకుని దేశ అభివృద్ధికి పనరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో కులాలు, మతాలు, విభిన్న జాతులు మమేకమై దేశ పురోభివృద్దికి పాటుపడాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ సత్సంకల్పంతో రాష్ట్ర ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేలా పిలుపునిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సీఎం ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలో నిర్వహించిన భారత జాతీయ జెండా భారీ ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, జిల్లాధికారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకోవడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగనిరతిని, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు జిల్లా అధికారులు కలిసి 100 మీటర్ల జాతీయా పతాకంతో టేక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా గాంధీ చౌక్ నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పర్యాటక అధికారి సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.