జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
*వర్షం ను లెక్క చేయకుండా
*మంత్రి ఫరూక్,మాజీ ఎమ్మెల్యే భూమా, ఏ. వి రాక
*హరి వ్యూహం విజయ వంతం
*సంబరాలలో టిడిపి నేతలు
తెలుగు దేశం అధికారం లోకి వచ్చి ఏడాది ఐన సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా గుంటుపల్లి హరిబాబు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు…ఒక వైపు టీడీపీ అధికారం లోకి వచ్చి ఏడాది ఐన ఆనందం…మరో వైపు శాంతికాముకుడు, వివాదరహితుడు హరిబాబు కు తెలుగు దేశం పార్టీ యార్డ్ చైర్మెన్ పదవి ఇచ్చినందుకు మంత్రి ఫరూక్ కు కృతజ్ఞతలు తెలిపారు…మొత్తం మీద నంద్యాల పట్టణం లోనీ మార్కెట్ యార్డ్ ప్రాంతం అంత సందడి వాతావరణం నెలకొంది…పండుగ వాతావరణం నెలకొనడానికి మంత్రి ఫరూక్,మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి తో పాటు ఇతర ప్రధాన నేతలు వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. దీంతో టీడీపీ నేతలు జై చంద్రబాబు,జై లోకేష్ అన్న అంటూ నినాదాలు చేస్తూ బహిరంగ సభ ను నిర్వహించారు…కొన్ని గంటలు ముందు కుంభ వృష్టి వర్షం కురిసిన జనం పెద్ద ఎత్తున తరలి రావడం టీడీపీ నేతలు కు సంతోషం కలిగిస్తున్నది…మంత్రి ఫరూక్, భూమా బ్రహ్మం ఎదుట చైర్మెన్ గుంటుపల్లి హరిబాబు,వైస్ చైర్మన్ గా రంగ ప్రసాద్ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు..తన ప్రమాణ స్వీకారం కు ఎన్నో ఇబ్బందులను లెక్క చేయకుండా వచ్చిన గ్రామ ,పట్టణ నాయకులకు హరి బాబు కృతజ్ఞతలు తెలిపారు..మంత్రి ఫరూక్,ex MLA భూమా బ్రహ్మనంద రెడ్డికి కృతజ్ఞతలు ను హరి బాబు తెలిపారు.