♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
నంద్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డికి కుప్పం రెడ్డెమ్మ స్మారక రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది.ప్రభాకర్ రెడ్డి రాసిన “మేడం. సి ” అనే నవలకు గాను ఈ అవార్డు ఇచ్చారు.ఈ రోజు చిత్తూరు లో చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెడ్డమ్మ ట్రస్ట్ అధ్యక్షురాలు డా కె. రామలక్ష్మి ఈ అవార్డు అందించారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ నవల లో రాయలసీమ సంస్కృతి గొప్పదనాన్ని అద్భుతంగా వివరించారని వక్తలు పేర్కొన్నారు.రచయిత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఏడాది కాలం లోనే మూడు ముద్రణలకు నోచుకుని పాఠకులను విశేషంగా అలరిస్తోంది అని అన్నారు. నంద్యాల జిల్లా లోని కుకూ fm లో ప్రసారం అవుతోన్న మొట్ట మొదటి నవల మేడం.. సి. అని కేవలం 40 రోజుల్లో దాదాపు 10వేల మంది శ్రోతలు వినడం ద్వారా రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కట్టమంచి బాల కృష్ణా రెడ్డి, ప్రముఖ రచయితలు ముని సురేష్ పిళ్ళే, ఎం ఆర్ అరుణ కుమారి, రోహిణి వంజారి, డా సుగుణ రావు, నంద్యాల జిల్లా జర్నలిస్ట్ ల సంఘం (APUWJ) గౌరవాధ్యక్షులు ఎం. జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు