♦జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔రూ.20 కోట్ల వ్యయంతో నవనరసింహ ఆలయాలు
⇔ఉత్తరప్రదేశ్ లోని నైమిశారణ్యంలో ఉత్తర అహోబిళం
దేశంలోనే అత్యంత శక్తి వంతమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పరిదిలోకి వచ్చే అహోబిళ క్షేత్రాన్ని నవనరసింహుల ఆలయాలను ఉత్తరప్రదేశ్ లోని నైమిశారణ్యంలో రూ.20 కోెట్లకు పైగా భక్తులతో సేకరించి ఉత్తర అహోబిళాన్ని నిర్మించారు..ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 35 కు పైగా అహోబిళం మఠం శాఖలున్నాయి..అహోబిళ క్షేత్రం ఏవిదంగా ఉందో అదేవిదంగా నైమిశారణ్యంలో నూతన ఆలయాన్ని ప్రస్తుత పీఠాది పతి రంగనాద యతీంత్ర మహాదేశికన్ ఆద్వర్యంలో నిర్వహించారు..ఈ ఆలయాన్ని ఈనెల 22 వతేదీన భక్తులకు అంకింతం చేయనున్నారు..తిరుమలతోపాటు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వైష్ణ వ క్షేత్రాలనుండి ఉత్తర అహోభిళం క్షేత్రంకు వెళ్లి కుంభాభిషేకం చేయనున్నారు..అహోబిళంకు సంబందించి ఇటువంటి ఆలయం మరో ప్రాంతంలో నిర్మించడం ఇదే ప్రధమమని ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ బట్ జనాస్త్రంతో తెలిపారు..ఈ ఆలయం సందర్శించే భక్తులకు సర్వరోగ నివారణతోపాటు సంతాన యోగం కలుగుతుందని అన్నారు..