డా.హరి……..ఉచిత వైద్య శిబిరాలపై గురి

♦జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔252 వైద్య శిబిరం

⇔14 వతేదీన ఉచిత వైద్య శిబిరం 

⇔షుగరు బిపి ఈసిజి, 2డి ఈకో ఉచిత పరీక్షలు

⇔రోగనిర్దారణ జరిగితే ఉచిత మందులు 

మూడు దశాబ్దాలనుంచి నంద్యాలజిల్లా కేంద్రంతో పాటు చుట్టు ప్రక్కల మండల కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్న సాయిబాలాజీ నర్శింగ్ హోం నిర్వహకులు డా యం హరినాదరెడ్డి ఏప్రియల్ 14 వతేదీన ఆదివారం 252 షుగరు,బిపి గుండె వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు..ఇది నంద్యాల జిల్లా కేంద్రంలోనే కాకుండా రాయలసీమలోని ఇన్ని వైద్య శిబిరాలు నిర్వహించడం హరినాదరెడ్డికే దక్కిందని పలువురు చర్చించుకుంటున్నారు..మూడు దశాబ్దాల క్రితం మొదటిసారి ఇదే వ్యాధులపై వైద్య శిబిరం ఆరంభించి ఇప్పటికి ప్రతి సంవత్సరం వైద్య శదిబిరాలను నంద్యాలపట్టణంతోపాటు చుట్టు పక్కల మండల కేంద్రాలలో కూడా నిర్వహిస్తూ ఇక నాగురి ఉచిత వైద్య శిబిరాలే అంటున్నారు డా హరినాదరెడ్డి..నల్లమల అటవీ ప్రాంతంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉంటారని వారిని చైతన్య పరచడానికి గతంలో బండి ఆత్మకూరులోను ఇప్పుడు రుద్రవరం మండల కేంద్రంలోని వాసాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోను వేలాదిమందికి షుగర్ బిపి ఈసిజి 2డి ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతోపాటుగా రోగ నిర్దారణ అయిన రోగులకు ఖరీదైన మందులను ఉచితంగా అందించడం మొదటినుండి ఆనవాయితీగా మారింది..ఏప్రియల్ 14 వతేడీన జరిగే వైద్య శిబిరం ఉదయం 7 గంటలనుంచి ఆరంబించి రోగులకు ఎండ బెట్టతో సంబందంలేకుండా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు..జనరల్ మెడిసన్ వైద్యులు డా గోపి నందన్,గుండె వైద్య నిపుణుల డా యం మురళీ కృష్ణ, కీళ్లు ఎముకల వైద్య నిపుణులు డా దిలీప్ కుమార్ రెడ్డి ,స్త్రీ వ్యాది నిపుణులు డా లక్ష్మి ప్రసన్న శిబిరంలో పాల్గొంటున్నారని శిబిరం నిర్వహకులు సాయి బాలాజీ నర్శింగ్ హోం అదినేత షుగర్ ,బిపి, గుండె వైద్య నిపుణులు డా హరినాదరెడ్డి తెలిపారు..వివరాలకు 08514747666,9502901999 నంబర్లను సంప్రదించాలని కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *