!!నంద్యాలలో పూలపల్లకి సేవను నిర్వహిస్తాం..ఈఒ !!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔గతం కంటే ఆరు లక్షలు ప్రత్యేక దర్శనాల ఆదాయం

⇔16 గ్రామాలలో దేవుడిపల్లకి తిప్పే దానిపై చర్చిస్తాం

⇔నంద్యాలలో మహానందీశ్వరుడిని కల్యాణమండపాన్ని పరిశీలిస్తాం

దక్షిణభారతదేశంలో అత్యంత శక్తివంతమైన శైవక్షేత్రాలలో ఒకటైన మహానంది పుణ్యక్షేత్రంలో జరిగిన శివరాత్రి వేడుకలను వైభవంగా ముగించారు..ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఈవేడుకలను ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు పాత్రికేయులు పోలీసులు నిర్వహించారని ఈఓ చంద్రశేఖరరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు..గత యేడాది కంటే ఈసారి నాలుగు లక్షలు అదికంగా ఆదాయం వచ్చిందని అన్నారు..ఈ కష్టకాలంలో ఇంత మొత్తం రావడం గొప్పే నని అన్నారు..ప్రత్యేక దర్శనాలు ద్వారా 24లక్షల 19 వేలు వసూలు అయిందని గత ఏడాదికంటే ఈసారి 6 లక్షలు అదికంగా వచ్చిందని అన్నారు..లింగోద్బవ సమయంలో గతంలో ఎన్నడూ లేని విదంగా రెండు వేల మంది దర్శనం చేసుకున్నారని అన్నారు…ప్రస్తుత ఏడాదిలో మహానందీశ్వరుడు కామేశ్వరీ దేవి అమ్మవార్లతో నంద్యాలపట్టణంలో పూలపల్లకి సేవను నిర్వహించి వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించే యోచనలో ఉన్నామని అన్నారు..సమావేశంలో పాల్గొన్న సీనియర్ రిపోర్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మహానంది క్షేత్రం కు చుట్టుపక్కల 16 గ్రామాలలో స్వామిపల్లకిని తిప్పే ఏర్పాట్లను చేయాలని కోరారు..దీనిని పరిశీలిస్తామని ఈఓ అన్నారు..జనాస్థ్రం ఎండి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ నిధులు కోట్లకు చేరుకున్నాయని ఈనిదులతో నంద్యాలపట్టణంలోని స్టేట్ బ్యాంకు కాలనీలో ఖాళీగా ఉన్న స్థలంలో భారీ కల్యాణ మండపం నిర్మించాలని సూచించారు..అంతేకాక ఆరుద్ర నక్షత్రం రోజున నవనందులను పాదయాత్రల ద్వారా దర్శనం చేసుకునే విదంగా ప్రణాళికలను కూడా రూపొందించాలని కోరారు..మహానందీశ్వరుడిని దీక్షలను పరిశీలించాలని జనార్ధనరెడ్డి సూచించగా ఒక్కొక్కటి పరిశీలించి అమలు చేస్తామని ఈఓ చంద్రశేఖరరెడ్డి హామీ ఇచ్చారు..ఆలయ ప్రధాన అర్చకుడు రవిశంకర్ అవదాని మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి అధికంగా భక్తులు వచ్చారని దర్శనాలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఆలయ ఉద్యోగి రేయింబవళ్లు కష్టపడ్డారని అన్నారు..తమ సహచర పూజారులు సైతం ఆలయంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు ఆశీస్సులు అందేవిదంగా వివరించారని వారికి కృతగ్నతలు తెలిపారు..సమాతవేశంలో ఎ ఇ ఓ మదు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *