- జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
మైండు గేమ్ ను ఎదుర్కుంటే ప్రత్యర్ధులను అవలీలగా ఎదుర్కోవచ్చని వైయస్ ఆర్ సిపి నాయకులు శిల్పా మోహనరెడ్డి ,శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిలు అంచనా వేస్తున్నట్లు సమాచారం..తమరాజకీయ ప్రత్యర్ధులైన మాజీ మంత్రులైన పరూఖ్ అఖిలప్రియ మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డి సామూహికంగా తమకు సంబందలేని అంశాలను తమకు అంటగడుతూ గ్లోబల్ కు మించి ప్రచారం చేస్తున్నారని శిల్పా భావిస్తున్నారు.. దీానిని ఎంత వేగంగా ప్రజల మనసులోనుంచి తొలగించాలని ఇందుకు అవసరమైన అంశాలను సభల్లో సమావేశాలలో వివరించడమే కాకుండా సోషియల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు..తాము ఎవరి మీదికి రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని వెళ్లమని తమజోలికి వస్తే స్థాయిన బట్టి సమాదానం చెప్పే ఆలోచనలతో 20 సంవత్సరాలుగా నంద్యాలలో రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారు..అయిన ప్రజల్లో తయను ఏదోవిదంగా బదనాం చేసి రాజకీయ లబ్ది పొందాలని తమ ప్రత్యర్ధులు కుట్రలు పన్నుతున్నారని ఎన్నికల సమయం కాబట్టి వీటిపై చూసి చూడనట్లు వ్యవహరిస్తే ప్రజలు నమ్మే పరిస్థి తి ఉందని అందువల్ల పార్టీ కార్యకర్తలు నాయకులు నోటి ప్రచారంతో కూడా తిప్పి కొట్టాలని క్యాడర్ కు ఆదేశించారు..ఎవరి బెదిరింపులకు తలఓగ్గమని తామైతే ఎవరినీ బెదిరంచమని నంద్యాలపట్టణంతోపాటుగా గోస్పాడు, నంద్యాల మండలాలలో తాము చేపట్టిాన ప్రభుత్వ అబివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు శిాల్పా సహకార్ ద్వారా పేదప్రజలకు ఇస్తున్న లబ్దిని కూడా పేద ప్రజలకు గుర్తుచేయాలని భావిస్తున్నారు..గతంలో ఎన్నడూ లేని విదంగా తమను ఇబ్బందిపెట్టాలని కూడా ప్రతిపక్షాలనాయకులు నిర్ణయించుకున్నారని వారు భావిస్తున్నారు..ఏది ఏమైన మైండ్ గేమ్ ను ఎదుర్కోనే వ్యూహాలను ఎప్పటికప్పుడు తయారుచేసుకుంటూ ఎన్నికల బరిలో నాలుగో విజయం సాదించాలని శిల్పా మోహనరెడ్డి,రవిచంద్ర కిషోర్ రెడ్డి,నాగినిరెడ్డిలు సిద్దమయ్యారు..