జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
నంద్యాల అసెంబ్లీ బిజెపి అభ్యర్తిగా పోటీ చేయాలని ఇందుకు నియోజకవర్గంలో గెలుపుకు అవసరమైన పనులు చేసుకోవాలని పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది..ఈ హామీతోనే మధుకూడా ప్రజాసంక్షేమకార్యక్రమాలపై వ్యక్తగత డబ్బును లక్షల్లో ఖర్చుచేస్తూ ముందుకు సాగుతున్నారు..తాను పెట్టే ఖర్చు అత్యది క సంఖ్యలో మహిళలకు మేలు జరగాలని భావిస్తూ క్రిస్ మస్ పండుగకు క్రైస్తవులకు, సంక్రాంతి పర్వదినం సందర్బంగా అన్ని మతాల మహిళలకు ఉచితంగా రవికె చీరలను పెద్ద సంఖ్యలో పంచుతున్నారు.అంతేకాక పట్టణంలో సామూహికంగా ఉపయోగపడే ముగ్గులపోటీలదగ్గరనుండి ఇతర కార్యక్రమాలకు విరాళాలను కూడా మధు అందిస్తున్నారు..నంద్యాల పట్టణంలోని ఎన్ జి కాలనీలోని ఎంట్రన్సుదగ్గర బిజెపి కార్యాలయం మరియు నివాసం ఏర్పాటుచేసుకుని వందమందికి పైగా అనుచరులను ఏర్పాటుచేసుకుని ప్రజలకు ఏ అవసరం వచ్చిన అందుబాటులో ఉండి ప్రజలకు సేవలను అభిరుచి మదు అందిస్తుండటంతో పార్టీనుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు..తెలుగుదేశం జనసేనతో బిజెపి కలిసిపోయినా పొత్తులో భాగంగా నంద్యాల టికెట్ మధుకు కేటాయిస్తారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు..లేని పక్షంలోె మూడు పార్టీలతో యుద్దంచేయాల్సి వచ్చి బిజెపి ఇండింపెండెట్ గా పోటీచేసినా మధునే నంద్యాల బరిలో బిజెపి తరుపున బరిలో ఉంటారని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు..పోటీకి సిద్దపడే మదు భారీ ఎత్తున కార్యక్రమాలను చేపట్టారని విజయం చేపట్టాలని అందుకు తగ్గ దూకుడు ప్రదర్శిస్తున్నారు.
మానాయకుడు కామారెడ్డి అభ్యర్థితరహాలో
రెండు మాసాల క్రితం తెలంగాణాలో జరిగిన ఎన్నికలలో కామారెడ్డి నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన వెంకటరమణారెడ్డి దేశ వ్యాప్తంగా చర్చనియాంశమయిన వ్యక్తిగా మారారు.. అక్కడ పోలింగు సమయానికిసిఎం అభ్యర్ధులుగాపోటీచేసిన రేవంత్ రెడ్డి,కెసి ఆర్ లను ఓడించారనిా ఇక్కడ అదే తరహాలో అభిరుచి మదు విజయం సాదిస్తారని ఆయన అనుచరులు బల్లగుద్ది చెబుతున్నారు..రెండు ప్రదాన పార్టీలకు చెందిన నాయకులుకొద్దిగా ఎక్కువో తక్కువతో నంద్యాలను పాలించారని వారికి తగ్గ అభివృద్ది జరగలేదని అందువల్ల కొత్త అభ్యర్ధులకు నంద్యాలప్రజలుపట్టంకట్టే ఆలోచనలో వారు ఉన్నారని బిజెపి నేతలు అంటున్నరు..ఇంతవరకు సాదారణ కార్యకర్తనుండి ఎదిగారని వచ్చే ఎన్నికలలో ఇద్దరు అభ్యర్ధులకు చుక్కలు చూపే ప్రయత్నం చేస్తున్నారని దేవుడు దయతో ఆయన లక్ష్యం నెరవేర్చుకుంటారని కూడా అబిరుచి మదు ప్రాణ స్నేహితులు విలేకరులకు తెలిపారు..