జనాస్ట్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
టిడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబునాయుడు ఆళ్లగడ్డ పర్యటనలో నంద్యాల మాజీ ఎంఎల్ఎ భూమాబ్రహ్మానందరెడ్డి చెవిలో ఏమి ఉపదేశించారో కాని అప్పటినుండి తన పర్యటనలను,కార్యక్రమాలలో జోరు పెంచారు..రెండు మాసాల క్రితం తనను నంద్యాల నియోజకవర్గ ఇంచార్జిగా తొలగించడం భాదాకరమని పార్టీ అగ్రనేతలకు వివరించి టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు…సమన్వయ కమిటీతోపాటుగా ఇతరనాయకులు ఎంత చెప్పినా వినకుండా భూమా మొండికేశారు..చివరికి ఆళ్లగడ్డ పర్యటనకు వస్తున్న బాబు సభకు కూడా గైరు హాజరయి తన బాదను వివరించాలని నిర్ణయించుకున్నారు..అయితే నీవు మందిని తరలించకున్న ఇబ్బందిలేదు..బాబు నీపట్ల ఎంతో సాప్ట్ కార్నర్ తో ఉన్నారు..అందువల్ల వచ్చి ఒక్క నమస్కారం పెట్టి వెళ్లాలని రాష్ట్ర నాయకులు బ్రహ్మానందరెడ్డి కి వివరించారు..దీంతో తన గౌరవానికి ఏ మాత్రం లోటు లేకుండా వందలాదిమంది అభిమానులతో ఆళ్లగడ్డకు వెళ్లి బాబుకు నమస్కారం పెట్టారు.బాబుకూడా బాదతో ఉన్న బ్రహ్మాన్ని ఎంతో మంచిగా పలకరించి నీకు నాహృదయంలో స్థానం ఉంది…నీపని నీవు చేసుకుంటూ వెళితే నేను నామినేషన్లలోపే నీకు మేలు చేకూరుస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం..ఈ హామీతోనే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు ముందుకు నడుస్తున్నాడు..పరూఖ్ తో టచ్ లో లేకుండా బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారంటీ ..లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతూ వైకాప నాయకులుచేస్తున్న అక్రమాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎస్ పిని కలిసి వివరిస్తున్నారు..ఇంటిదగ్గరకు కూడా తన అనుకూలమైన నాయకులను రమ్మని ఆహ్వానిస్తున్నారు..మొత్తంమీద బాబు మంత్రం పలించింది అని అందుకే జోరుగా…హుషారుగా బ్రహ్మం సాగుతున్నారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతున్నది…
Post Views: 978
Like this:
Like Loading...