జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
కూటమి సత్తా చూపే యత్నంలో హరిబాబు ….
• మంత్రి ఫరుక్ ఆశీషులతో మార్కెట్ యార్డుపదవి …
• బారీ ఎత్తున జన సమీకరణలో హరిబాబు ….
• మంత్రులకు,యం.ఎల్.,యం.పిలకు ఆహ్వాణం ….
• ఉదయం 9:00 గం౹౹లకే ప్రమాణం స్వీకారం .…
నంద్యాల అసెంబ్లీ నియొజక వర్గంలో కూటమి బలం ఏమిటో నిరూపించడానికి నంద్యాల మార్కెట్ యార్డు చైర్మెన్ గా గురువారం బాద్యతలు స్వీకరించబోతున్న గూటుపల్లి హరిబాబు సిద్దమయారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఆశీసులతో హరిబాబుకు మార్కెట్ యార్డు చైర్మెన్ పదవి లబించినది. రాష్ట్రస్తాయిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ దగ్గరనుంచి మరికొంత మంది మంత్రులు,యం.పిలు, యమ్. ఎల్. ల సహకారం లబించడంతో ఈ పదవిని హరిబాబు అవలీలగా కైవసం చేసుకున్నారు. తన తండ్రి రైతునగర్ వెంకటేశ్వర్లు తో పాటు హరిబాబు కూడా 40 సం౹౹ల నుంచి పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం వ్యతిరేక పార్టీలు అదికారంలోకి వచ్చిన తరువాత పార్టీ మారమని ముఖ్యనేతలు కొరిన హరిబాబు పార్టీమారక పోవడంతో ఆయనకు పార్టీ అదిష్టాన వర్గం ఫరుక్ సూచనలకు అంగీకారం తెలిపింది. నంద్యాలలో కాంగ్రేస్, వై.సి.పి యం.ఎల్ లు,యం.పి లు తమకు వ్యతిరేకంగా హరిబాబు ఉన్నాడని ఆర్తికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కొట్ల రూపాయలు నష్టపోయినా నిన్ను వీడని నీడను నేనే అంటూ హరిబాబు టి.డి.పి పార్టీలో కొనసాగడం ఆయనకు ప్రదానంగా కలిసి వచ్చిన అంశంగా రాజకీయ విశ్లేషకులు పేర్కోంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందర పార్టీ ఎన్నో బాద్యతలు అప్పగించిన వాటన్నింటిని బుజంమీద వేసుకొని ఎలాంటి ప్రచారం లేకుండా మౌనంగా విజయవంతం చేయడం కూడా ఆయనకు పదవి లబించినట్లు పార్టీ వర్గాలు పైర్కోంటున్నాయి. నేటి ప్రమాన స్వీకారానికి మంత్రి ఫరూక్ తో పాటు మరో మంత్రి జనార్ధన్ రెడ్డి మరి కొంతమంది మంత్రులను యం.పీలను,యమ్.ఎల్ లను ఆహానించారు. మార్కెట్ యార్డు పరిదిలోకి వచ్చే నంద్యాల టౌన్, నంద్యాలమండలం, గోస్పాడు మండలాల నుంచి కూటమి పార్టీలైన టి.డి.పి, బి.జే.పి. జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలను స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిచారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా కూడా ఆహ్వానాలు ఇస్తున్నారు. మొత్తముమీద కూటమిప్రభుత్వం అదికారం లోకి వచ్చినతరువాత అతి పెద్ద కార్యక్రమము హరిబాబు నంద్యాల పట్టణంలో నిర్వహిస్తుడండంతో పాటు తమప్రత్యర్తులకు దీటైన సమాదానము ఇవ్వాలంటే ఈ కార్యక్రమానికి బారీఎత్తున హాజరు కావాలని టి.డి.పి నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. మొత్తము మీద హరిబాబుతో పాటు డైరెక్టర్ లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తుండటం తో వారు కూడా 1000 నుంచి 2000 వేల మంది వరకు చంద్రబాబు, లోకేష్ బాబులకు జిందాబాదులు కొడుతూ పట్టణం సందడి వాతావరణంలో కొనసాగించాలని హరిబాబుతో పాటు ఆయన అనుచరులు నిర్నయించుకున్నారు. ఉదయం 9:00 గంటలలోపన నంద్యాల మార్కెట్ యార్డు ఆవరణకు చేరుకోవాలని హరిబాబు రైతులను టి.డి.పి, జనసేన, బీ.జే.పి కార్యకర్తలను, నాయకులను కొరారు.