♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నంద్యాల శ్రీశైలం నియోజకవర్గాల్లో చడిచప్పుడు లేకుండా అంతర్గతంగా పావులు కదుపుతున్న మైనార్టీ నాయకుల్లో హబీబుల్లా ఒకరు. ఈ రెండు నియోజకవర్గాల్లో లక్ష పదివేలకు పైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు. మైనార్టీలతో మంచి సంబంధం ఉన్న నేతల్లో హబీబుల్లా కావడంతో ఆయనకు వైఎస్ఆర్సిపి అగ్రనేతలు నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాలతో పాటు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మైనార్టీ ఓట్లను వేయించే బాధ్యత అప్పగించారు దీంతో ఆయన ఎలాంటి ఆర్భావటానికి వెళ్లకుండా ప్రచారం చేయడంతో పాటు మైనార్టీ నాయకులను పార్టీ వైపు తిప్పడంలో సఫలీకృతులు అవుతున్నారు ఇందులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం లో మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న అహమ్మద్ హుస్సేన్ ను వైఎస్ఆర్సిపిలో చేర్పించి శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపుకు ప్రయత్నాలు ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన నారా-హమారా రాష్ట్రస్థాయి సదస్సులో హబీబుల్లా పాల్గొని చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో హబీబుల్లాపై రాష్ట్రస్థాయి తీవ్రమైన కేసులు నమోదు చేశారు దీంతో జగన్ మనసును హబీబుల్లా చూరగొనడంతో ఆయనకు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ నాయకుని సిఫార్సు లేకుండా జగనే స్వయంగా రంగంలోకి దిగి క్యాబినెట్ హోదా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు ఇంత గౌరవం సీఎం నాకు ఇచ్చారని అందువల్ల ఆయనకు మైనార్టీ ఓట్లు వేయించి నంద్యాల శ్రీశైలం నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు విలేకరులకు తెలిపారు