నాయకుల ఇలాకాలో ఎవరికి మెజార్టీ….?

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి టిడిపి అభ్యర్థులకు వారి ప్రధాన అనుచరులకు తమ సొంత వార్డు సొంత గ్రామాలు ప్రతిష్టాత్మకంగా మారాయి .తమ నాయకునికి అత్యధికంగా మెజార్టీ తెప్పిస్తేనే తమకు నాయకుని దగ్గర వ్యతిరేకుల దగ్గర తలెత్తుకొని తిరగ గలుగుతామని లేనిపక్షంలో తీవ్ర అవమానాలకు గురికాక తప్పదని భావిస్తున్నారు. ముందుగా నంద్యాల పట్టణంలోని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ లు తమ వార్డులలో ఏకపక్ష పోలింగ్ జరుపుకోవాలని భారీ మెజార్టీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు .ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి తన సొంత గ్రామమైన ఉయ్యాలవాడలో, టిడిపి అభ్యర్థి శబరి తన సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులో ఏకపక్ష పోలింగ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితోపాటు నంద్యాల పట్టణంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి లు కూడా ఇదే తరహా యత్నం చేస్తున్నారు. అలాగే టిడిపి అభ్యర్థి ఫరూక్ ప్రధాన అనుచరుడైన మాజీ జెడ్పి వైస్ చైర్మన్, నంద్యాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొప్పుల శివ నాగిరెడ్డి అలాగే సీనియర్ న్యాయవాది టిడిపి రాష్ట్ర నాయకుడు తాతిరెడ్డి తులసి రెడ్డి కూడా తమ గ్రామాల్లో పట్టు నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

భీమవరంలో కాంగ్రెస్ అభ్యర్థి… గోకుల్

నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోకుల్ కృష్ణారెడ్డి తన సొంత గ్రామమైన భీమవరంలో భారీ మెజార్టీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు .మొత్తం మీద నియోజకవర్గంలోని చిన్న నాయకుని దగ్గర నుండి పెద్ద నాయకుని వరకు రెండు పార్టీలకు భారీ మెజార్టీ తెప్పించి తమ సత్తా ఇది అని నిరూపించుకునే యత్నంలో నిమగ్నమయ్యారు. వీరి గ్రామాల,వార్డుల పరిధిలో 3వేల నుండి 4 వేల మంది ఓటర్లు ఉన్నారు .వారందరూ తమ సత్తా చూపించుకునే యత్నంలో కసరత్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *