జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
——————————–
* రోజుకు 10వేల మంది భక్తులు
* 5వేల మందికి ఉచిత భోజనాలు
* భారీగా ఉచిత చీరలు,రవికలు పంపిణి
భారి జన సందోహాల మధ్య ప్రపంచంలో రెండో దేవాలయం అయిన జగజ్జనని అమ్మ వారి ప్రతిష్ఠ వేడుకలు ముగిసాయి.నంద్యాల జిల్లా కేంద్రంలోని జగజ్జనని ఆలయంలో ఈనెల 6తేదీ నుంచి 16 వ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా ఆరంభం అయ్యాయి.ఈనెల 10 తేదీ తో ముగిసాయి.రోజుకు 12 గంటలపాటు 10 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అంచనాలు వేస్తున్నారు.ప్రతి భక్తుడికి అమ్మ వారి మూలవిరాట్ దర్శనం చేయించారు.రోజుకు కనీసం 5వేల మందికి ఉచిత భోజన ప్రసాద వితరణ,అల్పాహార విందు ఏర్పాటు చేశారు.రోజుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళ భక్తులకు దాదాపు 500 మందికి చీరలు,వేయి మంది భక్తులు కు రవికలు,పురుషులకు పంచలు వంద మంది భక్తులకు ప్రతి రోజూ ఉచితంగా అందజేశారు.మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు,మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులకు ప్రత్యేక వసతిని ఆలయ నిర్వహకులు శివనాగ పుల్లయ్య తదితరులు ఏర్పాటు చేశారు.దాదాపు 200 మంది సేవకులు 5 రోజులపాటు భక్తులు తొక్కిసలాటకు గురి కాకుండా చూశారు.దాదాపు 10 మంది ప్రత్యేక పూజారులు వివిధ రకాలైన పూజలను నిర్వహించారు.మొత్తం మీద అంచనాలకు మించి జనాలు రావడంతో ఆలయ నిర్వహకులు ఆనందం కలిగిందని సంతోషం చెందుతున్నారు.