♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔నంద్యాల రామకృష్ణాకు దక్షిణాదిలోనే టాప్ హానర్
⇔68 కళాశాలలలో రామకృష్ణ సెంట్రల్ అవార్డుకు ఎన్నిక
⇔మాకెంతో గౌరవం లభించింది – రామకృష్ణా రెడ్డి
జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విభాగాల్లో గుర్తింపులు, అవార్డులు సాధించిన నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణా డిగ్రీ, పిజి విద్యాసంస్థలకు మరో భారీ గుర్తింపు లభించింది. విద్యార్థులకు అత్యున్నత విద్యా భోధనతో పాటు ఐఏఎస్, ఐపిఏస్‌లలో ప్రతిభ చూపే విధంగా విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో అత్యున్నత కసరత్తును అధ్యాపకులు కొనసాగిస్తున్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విద్యార్థులను పారిశ్రమిక వేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో కేంద్రం అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను అనంతపురం ఎస్‌కె యూనీవర్సీటి పరిధిలో ఆరంభించింది. ఈ యూనీవర్సీటికి ఏపి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని కళాశాలలు వస్తాయి. మూడు రాష్ట్రాలలోని కళాశాలలను అత్యున్నత స్టాండర్డు కలిగిన విద్యాసంస్థలను 68 మాత్రమే ఎంపిక చేశారు. ఇందులో రామకృష్ణా విద్యా సంస్థలు ఈకో-సిస్టమ్ ఇన్ ఎమర్జెన్సీ విభాగంలో ఎంపిక చేసి ప్రధాన అవార్డును ఈనెల 10వ తేది అనంతపురం ఎస్‌కె యూనివర్సీటిలో అందజేశారు. వివరాలను నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థలలో రామకృష్ణా రెడ్డి అందజేశారు. అవార్డు అందజేసే కార్యక్రమానికి ఎఐసి – ఎస్‌కెయూ చీఫ్‌లు రమణ రామనాథం, నాగ భూషణ రాజు, సిఈఓ శివకిషోర్, వైస్ ఛాన్సలర్ హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ మూడు రాష్ట్రాలలోని కళాశాలలో తమ కళాశాల ఎంపిక కావడం ఎంతో సంతోషమని తాము కుడా వారి నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు జి.హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి, కె.వి.బి.సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.