జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
వేధింపులు తట్టుకొలేక అసెంబ్లీ ఎన్నికల రెస్‌లోకి
ఎన్నికల పై నంద్యాల ఇంజనీర్ ఆసక్తి
యూట్యూబ్ ఛానల్ నిర్వహకుని మద్దత్తు
నంద్యాలకు చెందిన ఒక ఇరిగేషన్ ఇంజనీర్ అసెంబ్లీ రెస్‌లో ఉన్నట్లు సమాచారం. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన ఈ ఏఈ నంద్యాల పట్టణంలోని ఎన్‌జిఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం బనగానెపల్లె ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్న స్థాయి రాజకీయ కుటుంబానికి చెందిన ఇంజనీర్ గత కొంత కాలం నుంచి రాజకీయ నాయకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారులు కుడా ఇంజనీర్‌కు ఏదో ఓక రాజకీయ ముద్ర వేసి బదిలీలు చేయడం తో ఆ ఇంజనీర్ రాజకీయరంగ ప్రవేశం జరపాలని నిశ్చయించుకున్నారు.. వృతి పరంగా మరో రెండు, మూడు సంవత్సరాల్లో ఉద్యోగ విరమణ చేసే ఇంజనీర్‌కు ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న తనయుడు కుడా ఉన్నాడు. రాజకీయల్లోకి వెళ్లడానికి యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు సంపూర్ణ మద్దత్తు ప్రకటించడంతో త్వరలో తన సహాచరులతోనూ, ఇతరులతోనూ తన మనస్సులోని కోరికను వివరించే సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈయనకు సమస్య వచ్చినప్పుడు నంద్యాలకు పొరుగు ఎం ఎల్ ఏ అండగా నిలుస్తున్నాడు.దీంతో ఈయన ఇబ్బందినుంది బయట పడుతున్నారు. మొత్తం మీద ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ సంబంధిత ఇంజనీర్లలో జరుగుతున్నది.