జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానంటున్నావ్
ఎవరి మీద కోపం అన్న నీకు
ఏం చేస్తే చల్లారుతావ్..
అంత లావు నాగిరెడ్డే పిలిస్తేనే వెళ్లలేదు
వైయస్ఆర్సిపి వీరాభిమానివి నీవు … నంద్యాలలో ఏ వైయస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మారిన నీవు పార్టీ మారవని అంచన. 2014 భూమా నాగిరెడ్డి గెలుపులో కుడా కీలక భూమిక పొషించావ్. భూమా వైసిపి నుంచి టిడిపికి వెళ్లే సమయంలో నా వెంట నీవు కుడా రా… నేను చూసుకుంట నీకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవీ ఇపిస్తా అని భూమా నాగిరెడ్డి పదే పదే కోరిన నీవు తిరస్కరించి… నీ వీరాభిమాని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచావ్. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి వెంట తిరిగి ఆయన గెలుపుకు కృషి చేశావు. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకున్న వైసిపికి దూరంగా ఉంటున్నావు. చెప్పుకోదగ్గ వ్యక్తులు ఫోన్లు చేసిన లిప్ట్ చేయడం లేదు. వేరే నెంబర్లతో ఫోన్ చేస్తే నేనే స్థానికంగా లేను మీరు నా దగ్గరకి రావాల్సిన పని లేదు. నేనే ఫోన్ చేస్తా సమయం కుదిరితే మాట్లాడాదం అంటున్నావు. లోకల్‌గా ఉంటే గండా వెంకట సుబ్బారెడ్డి, ఏవిఆర్ఎస్‌విఆర్ వెంకటరామిరెడ్డి వ్యక్తులకు అత్యధిక సమయం కేటాయిస్తున్నావు. ఇంతకు నీవు ఎవరి పై కోపంగా ఉన్నావ్. నీ కోపంకు కారణం ఏమిటి … ఏం చేస్తే కూల్ అవుతావని అధికార పార్టీకి చెందిన ఇద్దరూ నేతలు రెండు రోజుల క్రితం నీ దగ్గరకు వచ్చి మంతనాలు జరిపారు. ఇంత వరకు ఈ వార్తలో నాయకుడు ఎవరో మీకు ముందుగా వివరించలేదు కదు…
ఇదేనండి బహిరంగ సభల్లో అణర్గళంగా మాట్లాడే మన గోపినాథ్ రెడ్డి గురించే… పదేళ్ల క్రితం బిజేపి సానుభూతిపరుడిగా పని చేస్తు వైసిపి వీరాభిమానిగా మారిన గొపినాథ్ రెడ్డి న్యాయవాదిగా పని చేస్తు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. ఈయనకు నంద్యాల పట్టణంలో భారీ పరిచయాలు స్నేహలు ఉన్నాయి. దీంతో ఎన్నికల సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు స్వయంగా కలిసి మద్దతు కోరుతుంటారు. అయితే ఈ సారి ఈయనే నామినేషన్ దాఖాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రతిపాదకులను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత నామినేషన్‌కు మంచి రోజును మీరు నిర్ణయించిన ఒకటే. నేను నిర్ణయించుకున్న ఒకటేనని చెబుతున్నారు. మొత్తం మీద అధికార పార్టీ నాయకులైన శిల్పా మోహన్ రెడ్డి, రవిలు ఈయనకు గౌరవం ఇస్తునే ఉన్నారు. ఈయన ఎవరి మీద కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. మొత్తం మీద నామినేషన్‌కు సన్నద్దం కావడం చర్చనీయాంశం అయ్యింది. ఎప్పటికీ ఇదే కోపం గొపినాథ్ రెడ్డిలో కొన్నసాగుతుందా లేదా అనే చర్చ ఆరంభమైంది.