జనవరి 11
జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
మహాశివరాత్రి సందర్బంగా దేశ వ్యాప్తంగా పాతిక సంవత్సరాలనుండి లక్షలాదిమంది భక్తులు శివదీక్షను స్వీకరిస్తారు..ఈదీక్ష తీసుకున్నవారు దీక్షను శ్రీశైలక్షేత్రం సందర్శించి ముగిస్తారు.మార్చి 8వతేదీన మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవాలని శ్రీశైల పండితులు ముహుర్తాన్ని ఖరారుచేశారు. అయితే దీక్షను ఈనెల 26 వతేదీ రిపబ్లిక్ డే రోజు నుండి మండల దీక్షను ఆరంభించాలని ముహుర్తం ఖరారుచేశారు.ఆతరువాత అర్దమండలం 21 రోజుల దీక్షను స్వీకరించేవారు 16వతేదీన ముగింపును మహాశివరాత్రి రోజు అయిన మార్చి 8వతేదీ ముగిస్తారు.
శుభ శుక్రవారం
మూడు శుక్రవారాలు శివదీక్షలలో కీలకం కాబోతున్నాయి. అన్ని శుక్రవారాలు కావడం విశేషం.మండలదీక్ష 26వతేదీ అర్దమండల దీక్ష పిబ్రవరి 16 వతేదీ పండుగరరోజుకూడా శుక్రవారం రావడంతో శివదీక్ష తీసుకునే వారికి శుక్రవార సెంటిమెంటు కొనసాగబోతోంది.
I am alredy take 20 November 2023 shiva diksha for Maha mandalam.