జనవరి 11
జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
షర్మిల రాజకీయ వ్యూహం పై
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు షర్మిల వ్యూహం పై రాష్ట్ర రాజకీయాలల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవలనే తెలంగాణ వైయస్ఆర్సిపి పార్టీని ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ సమక్షంలో విలినం చేసిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఈమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించి ఎన్నికల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకునట్లు ప్రచారం. అయితే ఈమెకు పగ్గాలు అప్పగించిన తరువాత వైసిపి పైనే తన భాణం సందిస్తుందా లేకా మరో పార్టీ తెలుగుదేశం పై కుడా తన విమర్శల అస్త్రాలను సందిస్తుందా అనే చర్చ సాగుతున్నది. రెండిటి పై విమర్శలు చేస్తే కాంగ్రెస్ రాష్ట్రంలో పెద్ద ఊపు వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైసిపిలో, తెలుగుదేశంలో శాసన సభ, పార్లమెంట్ సీట్లు దక్కని వారు చేరే అవకాశం ఉంది. అందువల్ల ఇద్దరు, పాత పార్టీల పై అగ్రహంతో ఉంటారు. రెండు గతంలో అధికారంలో కొనసాగినవే. రెండిటి అక్రమాలు అన్యాయాలను యండగడుతు తమ ఎన్నికల మేనిఫేస్టోను వివరిస్తే తప్ప ప్రజలు తమ వైపు మోగ్గుచూపారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద షర్మిల రాజకీయ ఫైట్ పై సర్వత్ర టెన్షన్ నెలకొంది.
బిజేపి అలా చేయకనే
బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేవలం అధికార పార్టీ వైసిపి పై విమర్శలు చేస్తు తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పిదాలను ఎండగట్టాక పోవడం వల్లే పార్టీ పికప్ కావడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పోత్తు కుదిరితే ఇప్పుడు చేస్తున్న విమర్శలు ఆత్మ రక్షణలో పడాల్సి వస్తుందని అందువల్ల విమర్శలు కేవలం వైసిపి పై చేస్తున్నట్లు కుడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలతో ఢీ కొంటేనే విజయం సాధ్యం అవుతుందని లేని పక్షంలో విమర్శలు చేయాని పార్టీకి మేలు చేకుర్చడానికనే అనే విమర్శలు వ్యక్తం అవుతాయి. మొత్తం మీద షర్మిల భాణాలు ఒకట, రెండా అన్నది త్వరలోనే తేలవచ్చు.