♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♠ అహోబిళం పీఠాధిపతితో మారంరెడ్డి జనార్ధనరెడ్డి అంతరంగం
♠ భక్తుల హృదయాలలోకి నరసింహస్వామిని తీసుకెళ్లారు
♠ నీటిసమస్యను తీర్చిన అపర భగీరదుడు
♠ కూల్ గా సమస్య విని నన్ను ఆశీర్వదించారు..
పెద్ద మనస్సు అహోబిళం పీఠాధిపతి శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికన్ ది .ఆయన తిరునక్షత్ర పండుగ సందర్బంగా నాఅభిప్రాయం…
నేను ఆళ్లగడ్డ లో టాప్ వన్ పత్రికలో పని చేసేవాడిని..అహోబిళ క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాబ్లం లను నిర్మోహమాటంగా వార్తలు రాసేవాడిని ..అప్పడు కొందరు నా దగ్గరికి వచ్చి పీఠాధిపతి శ్రీ నారాయణ యతీంద్ర మహా దేసికన్ నీ పై సీరియస్ గా ఉన్నారు..నీ పై శాపం పెడుతాడు అంటూ సహచర ప్రెస్ మిత్రులు భయపెట్టేవారు. అహోబిళంలోని ఇప్పటి ప్రధాన పూజారి శ్రీ రమేష్ , ఇఓ రామానుజన్ ,బద్రి తదితరులు నన్ను పీఠాధిపతి దగ్గరికి తీసుకెళ్లే వారు.. అయిన పెద్ద మనస్సు తో మీరు ఏమీ రాశారు అని అడిగి ఈసారి నాకు చెప్పు..అది జరుగకుంటే రాయండి..అని cool గా చెప్పి శ్రీ నరసింహ మంత్రం జపిస్తూ,. నన్ను అక్షింతలతో ఆశీర్వదిస్తూ తన దగ్గరున్న డాలర్ ఇచ్చి పంపేవారు..పీఠాదిపతి ఏ ఆగ్రహానికి నేను గురి కావలసి వస్తుందోనని అని బిక్కు బిక్కుమంటూ ఉన్న సమయంలో పీఠాధిపతి మాటలు ఎంతో ఊపిరి నిచ్చాయి.. ఒకసారి అహోబిళ క్షేత్రాన్ని నీటి కటకటనుండి విముక్తి కల్పించడంలో యతీంద్ర మహాదేశికన్ కీలక భూమిక పోషించారు..ఈవార్తకు అభినవ భగీరదుడు అని హెడ్డింగ్ పెట్టాను..ఆవార్త ఆయనకు ఎంతో సంతోషం కలిగించింది..ఆతరువాత ఎప్పుడూ ఆశీర్వాదానికి నా పాత్రికేయ మిత్రులు కెపిపి సుబ్బారావు ,వార్త నాగరాజు, అక్షింతల శ్రీనివాసులు , కలిసి వెళ్లినప్పుడు నన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించడంతోపాటుగా వచ్చీరాని తెలుగులో భగీరదుడు అనేవార్తను గుర్తుచేసేవారు..భక్తుల దగ్గరకు నరసింహస్వామిని చేర్చడంలో కీలకపాత్ర నారాయణ యతీంద్ర మహాదేశికన్ నుంచే ఆరంభం అయింది..అంతవరకు భక్తులకు పీఠాదిపతులకు పెద్ద సంబందాలు ఉండేవికావు.. ..అహోబిలం లో యతీంద్ర మహాదేశికన్ తిరునక్షత్ర వేడుకలు సోషియల్ మీడియాలో రావడంతో ఈకథనాన్ని గుర్తు చేసుకోవలసి వచ్చింది..