!1అహోబిలం కు గుర్తింపు లక్ష్యంగా సేతురామన్ అలుపెరుగని పోరాటం!!

జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్డనరెడ్డి


* కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,గడ్కారీ దృష్టికి
* రోజా,కొండా సురేఖల సహకారంతో రాష్ట్ర పండుగగా గుర్తింపు
* యునెస్కో గుర్తింపు కు ఆరంభమైన పోరాటం
* అలుపెరుగని పోరాటంతో సేతురామన్

అహోబిల క్షేత్రానికి ప్రపంచ గుర్తింపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరసింహ భక్తుడు ఇటాచి సంస్థ కో కన్వీనర్ కిడాంబి సేతురామన్ తన పోరాటం ఆపేటట్లు అగుపించడం లేదు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా జనవరి నుండి మార్చి వరకు ప్రతి ఏటా నరసింహస్వామి పారువేట ఉత్సవాలను నిర్వహించే సాంప్రదాయము కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతున్నది. ఈ పారువేట ఉత్సవాల్లో 45 రోజులపాటు, వేలాదిమందికి ప్రతిరోజు ఉచిత భోజన వసతిని కల్పించడంతోపాటు ,కనీసం రెండు లక్షల మంది నరసింహస్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.ఇటువంటి సాంప్రదాయం రాష్ట్రంలో గాని, దేశంలో గాని, మరెక్కడా లేదు.అందువల్ల ఈ ఉత్సవానికి ప్రపంచ గుర్తింపే లక్ష్యంగా సేతురామన్ పోరాటం చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి,బ్రిజేంద్రనాథ్ రెడ్డి ల ద్వారా రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాను,తెలంగాణ మంత్రి కొండా సురేఖను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా గుర్తించే ప్రయత్నం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర మంత్రులు గడ్కారీ, కిషన్ రెడ్డి లను కలుసుకొని వినతి పత్రాలు ఇచ్చి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అహోబిల క్షేత్ర ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాల్ (రమేష్), ఆయన సోదరుడు బద్రీనాథ్ కుమారుడైన సేతురామన్ ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వెళ్లకుండా నరసింహ స్వామి సేవ చేసుకుంటూ, ఇటువంటి ప్రధాన ప్రతిపాదనలతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.ఆయన పోరాటానికి నరసింహ స్వామి అనుగ్రహం లభిస్తుందని ఆంధ్ర,తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది నరసింహస్వామి భక్తులు బెస్ట్ ఆఫ్ లక్ సేతు… అంటూ విషెస్ తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *