♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇒ తిరుపతి సంఘటనలతో అప్రమత్తం
⇒ భక్తుడు వచ్చేసరికే పోలీసుల అలెర్టు
⇒ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా విజయవంతం
వైకుంఠ ఏకాదశి వేడుకలలో తిరుపతి సంఘటన పునరావృతం కాకుండా నంద్యాలజిల్లాలోని దాదాపు 30 మండలాలలో జరిగే వేడుకలను పోలీసులు కంటికి రెప్పలాగా కాపాడారు..తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఉచిత టికెట్లకోసం జరిగిన తొక్కిసలాటలో ఆరు మంది మృతి చెందారు..ఈ సంఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ లు తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేయడమే కాకుండా ఐదు మంది అధికారులను సస్పెండు, బదిలీలు చేశారు..దీనితో స్థానికంగా జరిగే వేడుకలలో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు రావడంతో స్థానిక ఎస్ పి అదిరాజ్ సింగ్ రాణా ఆద్వర్యంలో ఎ ఎస్ పి యుగందర్ బాబు, డిఎస్ పిలు స్వయంగా రంగంలోకి దిగారు..ఎస్ పినే స్వయంగా గురువారం రాత్రి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు..దీనితో స్థానిక పోలీసులు కూడా ప్రతి దేవాలయం దగ్గరకు వెళ్లి క్యూలైన్లను తొక్కిసలాట లేకుండా సాగే విధంగా చేశారు..గర్భాలయంలో ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు..బోజనాలు,అల్పాహారాల దగ్గర సైతం స్థానిక పోలీసు సిబ్బంది పర్యవేక్షణ చేశారు..మొదటి భక్తుని వద్దనుండి క్యూలైన్లలో ఉన్న చివరి భక్తుడి వరకు నిదానంగా దర్శనంచేసుకునే విదంగా పోలీసులు చూశారు..గతంలో ఒకరు ఇద్దరు కానిస్టేబుళ్లతో ఈ వేడుకలను నిర్వహించారు..ఇప్పుడు ఎస్ఐలు ,సిఐలు ఆలయానికి వచ్చే భక్తులను బట్టి కనీసం పది గంటలు పర్యవేక్షించారు..అహోబిళ క్షేత్రం దగ్గరనుండి అన్ని దేవాలయాల దగ్గర భక్తులు వచ్చే సరికే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు..శాంతి భద్రతల పేరుతో ఏ ఒక్కచోట కూడా పోలీసులు భక్తులను ఇబ్బందిపెట్టలేదనే సమాచారం అందింది..మొత్తం మీద ఏకాదశి వేడుకల వరకు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..