జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
* అంచనాలకు మించిన భక్తులు
* గతంలో ఎన్నడు లేనివిధంగా దర్శనాలు
* అప్రమత్తంగా పోలీసులు
* సేవలు చేసిన SRK NCC విద్యార్థులు
నంద్యాల జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ రామాలయం పాలకమండలి మూడు రోజుల్లో జరిగే రథోత్సవానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది .ధనుర్మాసం సందర్భంగా సంక్రాంతి పర్వదినం రోజున నంద్యాల పట్టణంలో ఐదు కిలోమీటర్ల పాటు రథోత్సవాన్ని నిర్వహించాలని పాలకమండలి అధ్యక్షుడు తల్లం సూరయ్య శెట్టి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుండి గాంధీ చౌక్ వరకు వెళ్లి తిరిగి రామాలయం చేరుకుంటుందని భారీ ఎత్తున భక్తులు పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేయాలని సూరయ్య కోరారు.
పోటెత్తిన భక్తులు:-
గురువారం సాయంత్రం నుండి ఆరంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేసి దివ్యాంగులను ,వయోవృద్ధులను కూడా దేవుని దగ్గరకు సులభంగా పంపే ఏర్పాటు చేశారు .దాదాపు 30 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు ఆలయ పాలకమండలి అంచనా వేసింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుండే దర్శనానికి భక్తులను అనుమతించారు. రాత్రి 9 గంటల వరకు సుగందాలతో అలంకరించిన వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే రామాలయంలో శివాలయం,రామాలయం,లక్ష్మీనరసింహస్వామి, వరాహ స్వామి, కనకదుర్గమ్మ, దక్షిణామూర్తి, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి దేవి, ఆంజనేయ స్వామి, విగ్నేశ్వర స్వామి ఆలయాల్లోనూ భక్తులు తండోపతండాలుగా దర్శించుకున్నారు. నవగ్రహాలను అనంత ఆదిశేషునికి పూజలు జరిపి ఏకాదశికి భక్తులు బై బై చెప్పారు. పోలీసులు చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు .రామకృష్ణ డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ముక్కోటి ఏకాదశి లో పాల్గొన్న ప్రతి భక్తునికి సూరయ్య కృతజ్ఞతలు తెలపడంతో పాటు రథోత్సవానికి ఆహ్వానించారు.