రాష్ట్రమాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆళ్లగడ్డ పర్యటన విజయవంతంకావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో,నాయకులలో, అభిమానులలో జోష్ నింపింది.2004 నుండి నంద్యాల పార్లమెంటు కాంగ్రెసు,వైసిపి అభ్యర్తులు గెలుపొందుతూ రావడంతో ఈసారి ఏంది అనే అధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులలో నెలకొంది..ఇంతవరకు జరిగిన నాలుగు ఎన్నికలలో ఆళ్లగడ్డలో వరుసగా 20 సంవత్సరాలనుండి వైకాపా కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందుతూ వస్తున్నారు.దీంతో టిడిపి క్యాడర్ నిస్థేజంలో కొనసాగుతూ వస్తున్నది..అయితే ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు రా కదిలిరా కార్యక్రమానికి అంచనాలకు మించి ప్రజలు తరలిరావడం ఒక ఎత్తు అయితే ….బాబు సభ ముగిసేంతవరకు సభాస్థలిలోనే జనం నిలిచిపోవడం మరో విషయం.అయితే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పదకాలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈకార్యక్రమం విజయవంతం కు కూడా ఆరు అంశాలు పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
1.ప్రభుత్వ వ్యతిరేకత తో జనం భారీ ఎత్తున తరలివచ్చినట్లు ఒక అంచనా
2.భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు మృతి చెందిన తరువాత అతిపెద్ద మొదటి బహిరంగ సభ కావడం మరో అంశం
3.భూమానాగిరెడ్డి ,శోభానాగిరెడ్డి ముద్దుల తనయుడు విఖ్యాత్ రాజకీయ పగ్గాలు తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం
4.భూమా అఖిలప్రియ ఈకార్యక్రమం తనమార్కుగా చూపించుకోవాలని చేసిన ప్రయత్నం
5.రాజకీయ ప్రత్యర్ధులతో అఖిలప్రియ ఢీకొనే విధానం
6.గ్రామస్థాయిలో తెలుగుదేశం ,భూమా అభిమానిని మిస్ కాకుండా స్వయంగా ఆహ్వానించడం
పై ఆరు అంశాలు కలిసి వచ్చాయని అంతేకాక తెలుగుదేశం పార్టీ, రాబిన్ శర్మ,యువగళం టీం సభ్యులు సంయుక్తంగా పనిచేసి చేయడమే చంద్రబాబు సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారని అంచనా వేస్తున్నారు.
Super success