నంద్యాల మాజీ ఎంఎల్ ఎ భూమ బ్రహ్మానందరెడ్డితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది..
మూడు మాసాల క్రితం వరకు నంద్యాల తెలుగుదేశంపార్టీ ఇంచార్జిగా కొనసాగిన బ్రహ్మానందరెడ్డిని ఇంచార్జి భాద్యతలు తప్పిస్తూ ఫరూఖ్ కు అప్పగించారు..అప్పటినుండి పార్టీ కార్యక్రమాలకు అంటీఅంటనట్లు వ్యవహరిస్తున్నారు.పార్టీ రాష్ట్ర నాయకులు జోక్యంచేసుకుని పార్టీ కార్యకలాపాల్లో ఎంతచురుకుగా పాల్గొంటే అంత గుర్తింపు ఉంటుందని చివరి నిమిషంలో ఏమిజరుగుతుందో చెప్పలేమని అమరనాధరెడ్డి ,ప్రభాకర్ చౌదరి, మాండ్రశివానందరెడ్డి తదితరులు వివరిస్తున్నారు. అయిన బ్రహ్మం అలక వీడలేదు. అందరూ నచ్చచెప్పంగా పరూఖ్ తో కలిసి కాకుండా స్వతంత్రంగానే అక్కడక్కడ తెలుగుదేశం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు..మంగళవారం ఆళ్లగడ్డ పర్యటనకు వచ్చిన చంద్రబాబును బ్రహ్మం తన అనుచరులతో కలిసారు అలిగిన విషయం గుర్తు తెచ్చుకున్న బాబు కొద్దిసేపు కారుదగ్గర బ్రహ్మానందరెడ్డిాతో మాట్లాడారు. అయితే ఆమాటలు ఏంటి అన్న విషయం వారిద్దరికిా తప్ప మూడోవారికి తెలియదు.బ్రహ్మంకూడా తన అనచరులతో కూడా ఏం మాట్లాడింది బయట పెట్టలేదు..అయితే బ్రహ్మం మాత్రం త్వరలోనే నంద్యాల నమస్తే అనే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుని ఇంటింటికి స్వయంగా వెళ్లడమా లేక పాదయాత్ర జరపడమా అనేదానిపై తర్జనబర్జనలు జరుపుతున్నట్లు సమాచారం.బాబును బ్రహ్మం కలిసినప్పుడు పరూఖ్ తో కలిసి తిరగాలని తరువాత టికెట్టు విషయం చర్చిద్దామని అన్నట్లు బ్రహ్మం అనుచరులు పేర్కొంటున్నారు..పరూఖ్ అనుచరులు మాత్రం కలిసి తిరగాలని ఆదేశించారని అంటున్నారు..ఏది ఏమైనా ఆళ్లగడ్డ సభ విజయంపై ఒక చర్చ జరుగుతుండగా బ్రహ్మంకు ప్రత్యేక సమయం కేటాయించి చర్చించడం దేశం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది
Ok sir
Very good, keep it up.