గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది..కలెక్టర్ రాజకుమారి

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

♦గిరిజనుల పిల్లలను పాఠశాలలకు పంపాలి

♦సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలకు కృషి

♦జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, ఆగస్టు, 09 :-

గిరిజనుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేయడంతో పాటు వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు.

శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఐటిడిఎ పిఓ వెంకట శివప్రసాద్,

గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందజేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో గిరిజన బాలబాలికల కోసం 13 ఆశ్రమ పాఠశాలలు, 9 గిరిజన వసతి గృహాలను ఐటిడిఎ, గిరిజన సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటిలో సరైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా చెంచుగూడాలలోని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని పాఠశాలలకు పంపాలన్నారు. చదువుతోపాటు వారికి నచ్చిన అంశాలపై దృష్టి సారించేలా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. తద్వారా వారి జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యావంతులైనప్పుడే తల్లిదండ్రులు వారికి వివాహం గురించి ఆలోచించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా చెంచుగూడాలలోని గిరిజనులకు ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్యాంపులు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయడం జరుగుతోందన్నారు. జిల్లా అధికారులు చెంచుగూడాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వారు చెడు వ్యసనాల బారిన పడకుండా వారికి అవగాహన కల్పించడంతోపాటు వారి జీవనోపాధికి అవసరమైన మెరుగుపరుచుకోవడం పట్ల అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా వారి జీవనోపాధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు.

చెంచుగూడాలలోని పివిటీజీలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా లక్ష ఎనభై వేలు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఎం జన్మన్ ద్వారా 600 ఇళ్లకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన సంఘాల నాయకులు కూడా ముందుకు వచ్చి వారికి ఇల్ల నిర్మాణాలు చేయించేలా చూడాలని గిరిజన సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గిరిజన వేషధారణలో చిన్నారులు వేసిన నృత్యాలు చూపరులను అలరించాయి.

అనంతరం గిరిజన సంఘాల నాయకులు ప్రపంచ ఆదివాసి దినోత్సవం విశిష్టతను వివరించడంతోపాటు వారి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న గిరిజన సంఘాల నాయకులను జిల్లా కలెక్టర్ శాలువా, మొమెంటుతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *