జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
#మూడవసారి ఈఓగా చంద్రశేఖరరెడ్డి
#రూ.65లక్షలనుండి పదికోట్ల టర్నోవర్
#చంద్రాకే మొగ్గుచూపిన శిల్పా చక్రం
#మరో వైపు ఎవర్నీ వేదించవద్దని శిల్పాక్లాస్
మెత్తంమీద కుట్రలను భగ్నంచేస్తూ మూడవసారి మహనంది ఎగ్జిక్యూటివ్ అదికారిగా చంద్రశేఖరరెడ్డి నియామకం అయ్యారు..పిభ్రవరి 11 వతేదీ నాటికి ఆయన నియామకం రద్దు అవుతుంది..మదర్ డిపార్టు మెంటు అయిన విద్యాశాఖకు జిల్లా స్థాయి అదికారిగా వెళ్లిపోతారని ఈయన వ్యతిరేకులు ఊహించారు..అయితే ఎంఎల్ఎ శిల్పాచక్రపాణిరెడ్డి అక్రమార్కులు అన్యాయాలు చేయాలని భావిస్తున్న వారిసూచనలను ప్రక్కన పెట్టి తిరిగి చంద్రశేఖరరెడ్డికే ఎండోమెంటునుంచి ఉత్తర్వేలు జారీచేయించారు..నాలుగేళ్ల క్రితం మహానంది ఈఓగా భాద్యతలు స్వీకరించిన చంద్రశేఖరరెడ్డి మహానంది క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై ఉక్కుపాదం మోపారు..దీంతో అన్ని రాజకీయపార్టీలకు చెందిన నాయకులు, ఆలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది,పూజారులు, అదికారులు ఆయనను రాకుండా అడ్డుకోవడానికి సకల ప్రయత్నాలు చేశారు..అయితే చక్రపాణిరెడ్డి ఆయన చేసిన మంచి పనులను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా తనకు చెడ్డపేరు రాకుండా చూసుకునే యత్నంలో భాగంగా మూడవసారి నియామకానికి సహకరించారు..చంద్రశేఖరరెడ్డి ఆలయ ఈఓగా రాకముందు కేవలం రూ.65లక్షలు మాత్రమే డిపాజిట్ ఉన్నాయి..ఇప్పుడు అవి నాలుగు ఐదు కోట్లకు చేరుకోవడమే కాకుండా మరో ఐదుకోట్లు వేరే రూపంలో మహానంది క్షేత్ర ఖాతాల్లో నిల్వ ఉన్నాయంటే ఏవిదంగా విదులు నిర్వహించారో అర్ధం అవుతుంది..పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా భారీ సంఖ్యలో వాహనాలు నింపుకునే విదంగా స్టాండును నిర్మిస్తున్నారు..ఇక టోల్ గేట్ అయితే రూ.1.71కోట్లకు వేలం వెళ్లే విదంగా చర్యలు తీసుకున్నారు..అయితే కొంతమంది పూజారులను అదికారులను తీవ్రంగా సతాయించేవారనే విమర్శలు ఉన్నాయి..ఈ విషయంలో చక్రపాణిరెడ్డి కూడా ఇఓను క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది..ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా మంచిదేనని అయితే ఆలయంలో నీలాగానే పనిచేసేవారిని ఎటువంటి పరిస్థితులలో సతాయించవద్దని చంద్రశేఖరరెడ్డికి క్లాస్ ను శిల్పా తీసుకున్నట్లు సమాచారం..ఏదైనా మూడవసారి భాద్యతలు తీసుకున్న చంద్రశేఖరరెడ్డి మరిన్ని భారీ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాలని భక్తులకు మేలు జరిగే విదంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బెస్ట్ ఆప్ లక్ చెబుతున్నారు..