జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
#చైర్మన్ పదివికే 20 మందికిపైగా పోటీ
#ఇక పాలకమండలికి వందమంది పోటీ
#శిల్పా నిర్ణయం ఎలా ఉంటుందో
#ఎన్నికలముందర ఎండోమెంటు నిర్ణయమెలా
దక్షిణ భారత దేశంలోని అత్యంత శక్తివంతమైన శైవక్షేత్రాలలో ఒకటైన నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో పాలకమండలి నియామకం ప్రశ్నార్ధకంగా మారింది..దాదాపు పదిమందికి పైగా పాలకమండలి సభ్యులున్న మహానంది క్షేత్రం శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది..ఎంఎల్ఎ శిల్పాచక్రపాణిరెడ్డి చేసిన సూచనల మేరకు పాలకమండలి నియామకం జరుగుతుంది..పిభ్రవరి 11వతేదీకి పాలకమండలి గడువు ముగుస్తుంది..చైర్మన్ గా కొమ్మా మహేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు..అయితే ఈయన స్థానంలో మరొకరిని నియమించడమా లేక ఈయననే కొనసాగిస్తారా అనే విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి..ఈసారి మహానంది క్షేత్రం పదికోట్ల టర్నోవర్ కు చేరుకోవడంలో ఎంఎల్ఎ చక్రపాణిరెడ్డి విశేష కృషిచేశారు.దీంతో పాలకమండలిలో సభ్యత్వంకోసం వైయస్ ఆర్ సిపినుండి అన్నికులాల నాయకులు విశేషంగా ప్రయత్నంచేస్తున్నారు..పాలకమండలి చైర్మన్ గా బలమున్న వైసిపి నాయకులు 20 మంది ఉండగా మరో పదిమంది సభ్యులకోసం 75నుండి 100 మంది నాయకులు తమకు అవకాశం ఇవ్వాలంటే …నాకు అవకాశం ఇవ్వాలని ఎంఎల్ఎ పై వత్తిడి తెస్తున్నారు.. ఎన్నికలముందర పదిమందికి ఇచ్చి వందమందితో ఎందుకు చెడ్డ కావాలా అనే అంశంపై ఎంఎల్ఎ తర్జనభర్జనలు పడుతున్నారు..మరో నెలరోజులలో శివరాత్రి పర్వదినం ఉండటంతో అందులో కీలకభూమిక పోషించవచ్చని పాలకమండలిలో స్తానంకోసం విపరీత ప్రయత్నం చేస్తున్నారు..శిల్పామాత్రం మనసులోని మాటను కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది..మొత్తం మీద ఆయన నిర్ణయం తెలివిగానే ఉంటుందని ఒక అదికార పార్టీ నాయకుడు పేర్కొన్నారు..పాలకమండలి నియామకంకు నోటిపికేషన్ ఎండోమెంటు శాఖ ఇస్తుందని ప్రస్తుతం ఎన్నికల నోటిఫిాకేషన్ వస్తే ఈ నోటిఫికేషన్ నిలుపదల చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదని మరికొంతమంది నాయకులు పేర్కొంటున్నారు..మొత్తం మీద పాలకమండలి నియామకంపై శిల్పా వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే…