జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
#గడవు ముగుస్తున్న దేశం సులోచన డిమాండ్
#అధికమైన విమర్శలు
#ఎన్‌జిలో కాలనీలో రూ.20 కోట్ల స్థలా ల అక్రమణ
#సున్నం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో అడ్డగోలు
#సమస్యలను నాకు చెప్పొద్దు … ఎమ్మెల్యేకు చెప్పండి
నంద్యాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ దేశం సులోచన మున్సిపల్ అధికారులకు విధించిన గడువు ముగుస్తున్నది. పది రోజుల క్రితం నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సమావేశంలో దేశం సులోచన అటు అధికార పార్టీని ఇటు అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా సంచలన ఆరోపణలు చేశారు. అనధికారికంగా రూ.40లక్షల వరకు డ్రా చేయాలని మున్సిపాలీటిలో నిర్ణయించుకున్నారని ఆరోపిచడమే కాకుండా పది రోజుల్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సైతం అయోమయంలో పడ్డారు. ప్రతిపక్ష కౌన్సిలర్లను నోరు ఎత్తకుండా చేసే ఇద్దరు, ముగ్గురు అధికార పార్టీ కౌన్సిలర్లను ముక్కున వేలు వేసుకునే విధంగా ఆరోపణల వర్షం కురిపించారు. సులోచన ఆరోపణలు మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా మీదనా లేక అధికారుల పైనా అనేది అంతు పట్ట లేదు. సులోచన విధించిన పదిరోజుల గడువు ముగుస్తున్న ఇంతవరకు సమావేశం తేది ఖారారు చేయకపొవడం పై ఆమె అగ్రహంగా ఉన్నారు. మున్సిపల్ సమావేశంలో తాను ఆరోపణలు చేసిన తరువాత సహచర కౌన్సిలర్లు ఆమె పై అభినందనల వర్షం కురిపించారు. అంతేకాక మీరు ఇలా విమర్శలు చేస్తారని తెలిసి ఉంటే మా దగ్గర కొన్ని అక్రమాలపై ఆదారాలు ఉన్నాయి. వాటిని వెలుగులోకి తెచ్చేవారమని సులోచనకు సహచర కౌన్సిలర్లు చెప్పినట్లు సమాచారం.
#నంద్యాల పట్టణ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురి అవుతున్న పట్టించుకోవడం లేదని దాదాపు 20 కోట్లు విలువ చేసే రెండు ఎకారల స్థలాన్ని కబ్జా చేశారని ఈ విషయం రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు తెలిసి కుడా నిమ్మకు నీరెతినట్లు వ్యవహరిస్తున్నారు.
#42వార్డులలో దోమలు నివారించడానికి తీసుకొవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఇందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, సున్నం తదితర వాటికి టెన్షన్‌గా నిధులు విడుదల అవుతున్నాయి. కానీ సున్నం, బ్లీచింగ్ పౌడర్ ఆఫీకు చేరడం లేదని కొందరూ కౌన్సిలర్లు దేశం సులోచన దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
#పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చే బట్టలు, సబ్బులు ఇవ్వలేదని సులోచన దృష్టికి తెచ్చారు. అయితే ఇవ్వన్ని తన దృష్టికి తేవడం కంటే ఎమ్మెల్యే రవి, మాజీ మంత్రి మోహన్ రెడ్డి తరచూ కౌన్సిలర్లతో సమావేశాలు జరుపుతున్నారని వారికి దృష్టికి తెస్తే మీకు న్యాయం జరుగుతుందని సులోచన వివరించినట్లు తెలుస్తొంది.
ఇది ఇలా ఉండగా సులోచన డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయని ఆకస్మికంగా కమీషనర్ రవిచంద్రారెడ్డి బదిలీ అయ్యారని ఆయన స్థానంలో నిరంజన్ రెడ్డిని నియమించారని కొద్ది రోజులు సమయం తీసుకొని సులోచన ఆరోపణలకు సమాధనం ఇస్తారని మున్సిపాలీటి అధికారులు అన్నారు.