జనాస్త్రం ప్రతినిధి మారంరెడ్డి జనార్దనరెడ్డి
#అదిరేను ఆయన స్టైలే
#ప్రతిభ ఉంటే ఆకాశంలోకి…
#ప్రొఫెసర్ల దగ్గర నుంచి వేలల్లో ఉద్యోగులు
#తండ్రికి తగ్గ హేమంత్ కోడలు ప్రగతి
రాయలసీమలోనే కాకుండా రాష్ట్రంలోనే విభిన్నమైన రీతిలో డిగ్రీ పిజి కళాశాలలు 35 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్న రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డా.రామకృష్ణారెడ్డి విద్యా విధానంలోనూ విద్యార్థుల పట్ల ఆయన వ్యవహరించే తీరు విభిన్నమైనదిగా అగుమిస్తుంది. నంద్యాల జిల్లా కేంద్రంలో 35 సంవత్సరాల నుంచి ఈ రెండు విద్యా సంస్థలకు ప్రాణం, ఊపిరి ఆయన క్రమశిక్షనే ప్రధానంగా చెప్పుకుంటారు. ముందుగా ఆయన పొరపాటు చేయడానికి యే మాత్రం అగీకరించడు…. ఆ తరువాత అక్కడ చదువుతున్న వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో క్రమశిక్షనకు వ్యతిరేఖంగా ఉండడం సహించడు. వ్యతిరేఖంగా ఉన్న విద్యార్థిని , విద్యార్థుల తల్లిదండ్రులు గానీ వారివెనుక ఎంత బలవంతులు ఉన్న వారికి బెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. ప్రతిభ ఉంటే వారిని ఆదరించడంలో కుడా రామకృష్ణారెడ్డి ముందుంటాడు. కళాశాలలో ప్రతి మూడు సంవత్సరాలు 3, 4 వేల మంది విద్యార్థిని, విద్యార్థులు చదివిన సందర్బాలు పాతిక సంవత్సరాలు ఉంటాయి. లవ్లో పాటు ఇతర నడవడికిలతో సహాచర విద్యార్థులు నష్టపోయేట్టు ఉంటే వారిని సహించడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి అండగా నిలిచిన వారికి అసలు విషయం చెప్పి వీరికి టిసీలు ఇచ్చి నిర్మొహమాటంగా బయటకి పంపుతాడు. అటెండెన్సు ఇస్తే మేము కళాశాలకు రామని చెప్పే వారికి సీట్ ఇవ్వడు. 70 శాతానికి తక్కువ అటెండెన్సు ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతించడు. జనరల్ నాలెడ్జిని విద్యార్థుల్లో పెంపొందించడానికి అత్యధిక ప్రధాన్యత ఇచ్చే రామకృష్ణారెడ్డి ప్రొత్సహించడమే కాకుండా అర్థికంగా బీదవారైతే తన సొంత డబ్బు పెట్టి ప్రొత్సహించిన సందరర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ప్రోత్సహించిన వారు యూనివర్సీటీలో ప్రొఫెసర్స్ గాను ఇతర ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. విద్యాసంస్థలకు భవిష్యత్తు వారసులుగా కొనసాగుతున్న రామకృష్ణారెడ్డి తనయుడు హేమంతరెడ్డి, కోడలు ప్రగతి రెడ్డిలు కూడా సార్ మాదిరిగానే తమ ఆలోచనలను విద్యార్ధుల ప్రయోజనాలకే అన్న విధంగా కొనసాగుతున్నారు..దీంతో భవిష్యత్తు కూడా విద్యాసంస్థలు ఇప్పటిమాదిరిగానే దేదీప్యమానంగా కొనసాగుతాయని విద్యా పరిశీలకులు అంచనా వేస్తున్నారు..మొత్తం మీద రామకృష్ణారెడ్డి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.