యస్సా……..మిస్సా…….

నంద్యాల జనవరి 09

జనాస్త్రం ప్రతినిది; మారంరెడ్డి జనార్దన రెడ్డి

నంద్యాల పార్లమెంటు వైకాపా అభ్యర్ధిగా తిరిగి పోచా బ్రహ్మానందరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ను పార్టీ అద్యక్షుడు జగన్ మోహనరెడ్డి ఇస్తారా…లేదా.. అన్న చర్చ సాగుతున్నది. జగన్ కు ఉన్న అతికొద్దిమంది నమ్మకందారులలో బ్రహ్మానందరెడ్డి ఒకరు. 80శాతానికి పైగా బ్రహ్మానందరెడ్డికే జగన్ తిరిగి అవకాశం ఇస్తారని లేని పక్షంలో మైనారిటీ అభ్యర్ధిని తెరపైకి తెస్తే పోచా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలలో చర్చ సాగుతున్నది. గత ఐదేళ్లలో నంద్యాల పట్టణముతోపాటు ఉయ్యాలవాడ మరికొన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.అంతేకాక నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఒకరుఇద్దరు ఎంఎల్ఎ లు మినహాయిస్తే మిగిలిన వారందరూ పోచాకే తిరిగి ఇవ్వాలని పార్టీకి వివరించినట్లు తెలుస్తోంది.. పార్టీకూడా మాకు పోచాపై నమ్మకం ఉందని విధిలేనిపరిస్థితులలో మైనారిటీలకు ఇవ్వాల్సి వచ్చినా,కొత్త అభ్యర్థిని ఎంపికచేయాలనే సమీకరణలలో మిస్ కావచ్చు. లేని పక్షంలో పోచాకే యస్ అన్నా ఆశ్చర్యపోవాలిసిన అవసరంలేదని అంటున్నారు. పోచా మిస్ అయితే శిల్పా మోహనరెడ్డికాని, సినీనటుడు ఆలీపేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

నావాడు…నేను చూసుకుంటా…..

పార్లమెంటు పరిదిలోని ముగ్గురునలుగురు ఎంఎల్ఎలు జగన్ ను కలిసి ఎలాగైనా టికెట్టు పోచాకే ఇవ్వాలని పార్ఠీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.అయితే ఈవిషయంలో మనకంటే జగనే పోచాకు ఇవ్వాలని మనసులో ఉందని నావాడు….నేను చూసుకుంటా…ఈవిషయంలో నాకు,పోచాకే వదిలివేయాలని జగన్ అంటున్నట్లు సమాచారం..జగన్ కు ఇంత నమ్మకం కలిగించడానికి రెండుదశాబ్దాలనుండి వైయస్ కుటుంబానికి పోచా వీరాభిమానిగా కొనసాగడమేకాకుండా ఒక చిన్న పదవినుండి పార్లమెంటు పదవికి వెళ్లాడంటే అది జగన్ వల్లే జరిగిందని పోచా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.త్వరలోనే సప్పెన్సుకు తెర పడుతుందని కూడా పార్టీవర్గాలలో చర్చ సాగుతున్నది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *