జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
మహానంది, ఆగస్టు 08 (జనాస్త్రం)
నంద్యాలజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది
.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ,పుణ్యాహవాచనం, వరలక్ష్మీ కలశప్రతిష్ఠా,అథాంగపూజ,తోరపూజలు చేసుకుని మహిళలు ఒకరికొకరు తోరమును కట్టుకున్నారు.పూజ అనంతరం అమ్మవారిని కోనేర్లో నిమజ్జనం చేశారు.పాల్గన్న వారందరికి దాతలు వాయనాలు సమర్పించినారు.దేవస్దానం నుంచి ప్రసాదం,భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతులతో పాటు పాల్గొన్న భక్తులందరూ ఎంతో మంగళకరంగా ఈ వ్రతాన్ని చేశారు.కార్యక్రమంలో వందలాదిమంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.