జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
————————
* ఒకే పేరు తో 9 ఆలయాలు
* పారువేట ఒక ప్రత్యేకత
* దేవుడే ప్రజల దగ్గరకి వెళ్లడం ఎప్పుడైనా,ఎక్కడైనా చూసారా
* నరసింహ అని గట్టిగా మబ్బులో పిలిచినా ప్రతి వేయి మంది లో 200 మంది పలుకుతారు.
* స్వంతగానే అహోబిలం ఉత్సవాలు తెలుసుకొని వస్తారు.
లక్ష మంది భక్తులు పాల్గొనే నంద్యాల జిల్లా అహోబిల నరసింహస్వామి క్షేత్రంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
* దేశ వ్యాప్తంగా 108 వైష్ణవ క్షేత్రం లలో అహోబిలం నరసింహస్వామి ఆలయం ఒకటి.
* నల్లమల అటవీ ప్రాంతం లో మూడు జాతీయ ఆలయాలు ఉంటే అందులో అహోబిలం ఒకటి.మిగిలిన రెండు పెద్ద ఆలయాల్లో శ్రీశైలం,తిరుమల ఉన్నాయి.
* నల్లమల అడవుల్లో ఉన్న మూడు దేవాలయాలు సర్పం ఆకారంలో ఉంటాయి.తిరుమల తల గా అహోబిలం నడుము ,శ్రీశైలం తోక గా కొందరు చరిత్రకారులు పేర్కొంటూ ఉంటారు.
* నరసింహ స్వామి తొమ్మిది ఆకారాలలో దర్శనం ఇవ్వడం అహోబిలంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఏ ఆలయంలో దర్శనం ఇవ్వరు.
* 600 ఏళ్లకు పైగా ఇక్కడ బ్రహ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
* నరసింహ స్వామి పారువేటకు ఉన్న ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడా,ఏ ఆలయాలకు లేదు.
* నా కల్యాణంకు రండి అంటూ 40 గ్రామాలలో తిరిగి భక్తులను స్వామి పిలువడం కూడా ఎక్కడ లేదు.ఇది అహోబిలం నరసింహస్వామి దేవాలయం ప్రత్యేకత.
భారిగా అహోబిలంలో జరిగే ఉత్సవాలకు జనం హాజరైన సందర్భంలో 7,8 అడుగుల ఎత్తులో నిలబడి నరసింహ అని పిలిస్తే ప్రతి వేయి మంది లో 200 మంది ఓ.. ఓ అని కానీ ఏం..ఏం అంటూ ప్రతి సమాధానం ఇస్తారు. అంటే నరసింహ స్వామి భక్తులు ఏ స్థాయి లో ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడికి వచ్చే భక్తులలో 70 శాతం బడుగు బలహీనర్గాలకు చెందిన వారు ఉంటారు.అందుకే హండీలలో పెద్దగా డబ్బులు రావు అంటుంటారు.
బ్రహ్మోత్సవాలకు హాజరైన వారిలో ప్రచారం చూసి వచ్చే వారు 30 శాతం లోపే.మిగిలిన 70 శాతం మంది పౌర్ణిమ రోజును క్యాలెండర్ లో చూసి కరెక్ట్ గా అహోబిలం చేరుకుంటారు.ఆరోజు కీలకమైన ఉత్సవం,గరుడోత్సవం ఉంటుంది.
పండితుల కంటే పామురులు 60 శాతంకు పైగా భక్తులు ఉంటారు.
తమిళ సంప్రదాయ పూజలు,ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి.
కల్యాణం, గరుడోత్సవం,ఇతర వాహన సేవలు సాయంత్రం ప్రారంభమై రాత్రితో ముగుస్తాయి.
ఒక్క రథం వేడుక మాత్రం ఉదయం జరుపుతారు.ఇది కూడా అరుదైన అవకాశం గా భక్తులు భావిస్తుంటారు. ఇలాంటి ప్రత్యేకతలు ఇంకా ఎన్నో ఉన్నాయి.