భూమాబ్రహ్మంకు బాబు ఫోన్ కాల్

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔కిషోర్ పార్టీ మారడంతో అలర్టు

⇔ప్రత్యర్ధులపార్టీ నుండి బ్రహ్మంకు ఆహ్వానం

⇔టిడిపిలోనే ఉంటానని వారికి తెగేసి చెప్పినట్లు సమాచారం

గత కొద్ది మాసాలనుండి నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి పరూఖ్ తో దూరంగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి పార్టీ జాతీయ అద్యక్టుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పోన్ చేసినట్లు సమాచారం అందడంతో దేశం వర్గాల్లో ఆనందం వ్యక్తంచేస్తున్నారు..నాకే టికెట్టుకావాలని భీష్టించుకుని కూర్చున్న బ్రహ్మానందరెడ్డి దూరంగా ఉంటే పార్టీకి భారీ నష్టం వచ్చే పార్లమెంటు ,అసెంబ్లీ ఎన్నికలలో జరుగుతుందని కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబుకు తెలపడంతో ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది..ఏపరిస్థితులలో నిన్ను ఇంచార్జి స్తానం నుండి తప్పించాల్సి వచ్చిందో నీకు స్పష్టంగా చెప్పడం జరిగిందని తెలుగుదేశంపార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే నీకు ప్రభుత్వ పరంగా అత్యున్నత పదవిని అప్పగించి తీరుతానని హామీ ఇచ్చానని చంద్రబాబు గుర్తుచేసినట్లు సమాచారం..ప్రత్యర్ది పార్టీలకు చెందిన రాష్ట్ర,జాతీయ స్థాయి నాయకులే టిడిపి వైపు మొగ్గుచూపుతున్నాయని ఏడుఎనిమిది ఏళ్లనుంచి పార్టీకోసం పనిచేసిన నీసేవలను విస్మరించే ప్రసక్తే లేదని వివరించినట్లు తెలుస్తోంది..వారంరోజులక్రితం భూమా బ్రహ్మానందరెడ్డి సమీప బందువు కిషోర్ రెడ్డి (ఆళ్లగడ్డ )వైసిపిలో చేరడం జరిగింది..రెండో వికెట్ గా బ్రహ్మానందరెడ్డిని తమవైపు తిప్పుకునేందుకు వైసిపి చేస్తున్న ప్రయత్నానికి బ్రేకు వేయడమే లక్ష్యంగా తెలుగుదేశంపార్టీ ఈ దిద్దుపాటు చర్యకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం అంతేకాక టిడిపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కరుడు గట్టిన కార్యకర్తలు ,నాయకులు కూడా బ్రహ్మం అవసరం పార్టీకి కావాలని అందువల్ల త్వరగా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టాన వర్గం దృష్టికి తేవడంతోనే ఈపోన్ కాల్ వచ్చినట్లు సమాచారం..అయితే బ్రహ్మం ఇప్పటివరకు ఎన్ని పార్టీలనుండి వత్తిడి వచ్చినా స్పందించలేదు..ఇక చంద్రబాబు పోన్ కాల్ కు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *