♦ సౌత్ సౌండ్ రామకృష్ణదే..♦

♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరె డ్డి

⇒చెన్నై లో ఆడే రాయలసీమ టీంకు రామకృష్ణా ఆతిథ్యం

⇒ 16 కళాశాలల విద్యార్ధులు ప్రతిభా యత్నం

⇒ విజయం యూనివర్శిటిదే అంటున్న రామకృష్ణారెడ్డి, హేమంత్ రెడ్డి

¡

రాయలసీమ యూనివర్శిటీ తరుపున దక్షిణాది యూనివర్శిటీల పోటీలలో విజయం సాదించడానికి నంద్యాలప ట్టణంలోని రామకృష్ణ పిజి కళాశాల మైదానంలో క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఆరంభమయ్యాయి..చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆద్వర్యంలో డైరెక్టరు హేమంతరెడ్డి పిజికల్ డైరెక్టరు విజయకుమారి పర్యవేక్షణలో పోటీలను ఆరంబించారు.. కర్నూలు నంద్యాల జిల్లాలలోని 16 కళాశాలలనుండి 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు..మొత్తం 16 మందిని ఎంపికచేసి దక్షిణాది అంతర్గత విశ్వ విద్యాలయాల క్రికెట్ పోటీలు తమిళనాడు రాస్ట్రంలోని చెన్నైలో జరిగే పోటీలలో పాల్గొనే విదంగా బౌలర్లు, బ్యాటర్లు, కీపర్లు తో పాటు క్యాచ్ లను అవలీలగా పట్టుకునే విద్యార్ధులను ఎంపికచేస్తున్నట్లు హేమంత్ రెడ్డి విజయకుమారిలు తెలిపారు..జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో గెలుపులు రాయలసీమ యూనివర్శిటీకి కొత్త కాదని అందులో కీలక భూమిక పోషించే రామకృష్ణా విద్యాసంస్ధల విద్యార్ధులకు కొత్త కాదని రామకృష్ణారెడ్డి అన్నారు..చెన్నైలో జరిగే పోటీలకు దక్షిణాది రాష్ట్రాలలోని 80 నుంచి 90 విశ్వవిద్యాలయాల క్రీడాకారులు పాల్గొోంటారని అందువల్ల వారికంటే దీటైన ప్రతిభ మనం చూపాలని అప్పుడే విజయం మనకు దక్కుతుందని అన్నారు..ఈనెల 16 నుంచి 21 తేదీ వరకు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుందని అందులో పాల్గొనే క్రీడాకారులను పరిశీలకుల సమక్షంలో ఎంపిక చేస్తున్నట్లు రామకృష్ణారెడ్డి,హేమంత్ రెడ్డిలు తెలిపారు..ప్రిన్సిపల్ సుబ్బయ్య, ప్రగతిరెడ్డి,ఇంతియాజ్ అహమ్మద్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *