నంద్యాల జనవరి 08(జనాస్త్రం);
జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
నంద్యాల అసెంబ్లీ బరిలో కనీసం 20 మంది అభ్యర్ధులు దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు.నంద్యాల అసెంబ్లీకి ఏప్రియల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇప్పటినుండే వారు ప్రచారం ఆరంభించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు,ఎన్నికల గుర్తులతో పోటీచేయడానికి 10మంది ప్రయత్నం చేస్తుండగా మరో 10మంది బయటపడకుండా అంతర్గతంగా పార్టీ టికెట్లకోసం ప్రయత్నిస్తున్నారు.లేనిపక్షంలో ఇండిపెండెంటుగానైనా పోటీచేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అదికార వైకాపా తరుపున ఎంఎల్ఎ శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది..టిడిపి తరుపున ఎన్ ఎండి పరూఖ్ రంగంలో ఉన్నారు. వీరిద్దరూ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమై ప్రచార బరిలో దిగారు. వీరిద్దరితో పాటు మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డికూడా వీరిద్దరిని వ్యతిరేకిస్తూ టికెట్ వస్తే టిడిపి లేకుంటే ఇండిపెండెంటుగా బరిలోదిగాలని భావిస్తున్నారు.
బిజెపి తరుపున అబిరుచి మదు;
తెలుగుదేశం పార్టీతో బిజెపికి పొత్తు కుదిరినా లేక పైటుకు సిద్దమైన బిజెపి అబ్యర్దిగా తాను బరిలో ఉంటానని బిజెపి నాయకుడు అభిరుచి మధు అంటున్నారు. తనకు అన్నిరకాల అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్మకం.వైయస్ ఆర్ సిపి మైనారిటికి ఇస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ డా నౌమాన్, ప్రభుత్వ సలహాదారు హబిబుల్లా తోపాటుగా ప్రస్తుత ఎంఎల్ సి ఇసాక్ భాషా మహిళా మైనారిటీకోటాలో ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ మాబున్నిసాకూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం.వీరుకాకుండా వైసిపి రెబల్ అభ్యర్ధి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నంద్యాల జడ్పిటిసి సభ్యుడు గోకుల్ కృష్ణారెడ్డి,జర్నలిస్టు జయప్రకాష్,గోల్ల రాజేష్ తోపాటు,కాంగ్రెసు,సిపియం,సిపిఐపార్టీలతరుపున మరికొంతమంది అసెంబ్లీబరిలో దిగాలని ఉవ్విళ్లుూరుతున్నారు.