జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నంద్యాల పట్టణంలోని ప్రముఖ జగన్ హాస్పిటల్స్ అధినేత డా. జగన్ మోహన్ రెడ్డి సతీమణి డా. సింధు శ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యురాలిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గం నుండి అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర మంత్రివర్యులు Nmd ఫరూక్ కి డా. సింధు శ్రీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి Nmd ఫరూక్ మాట్లాడుతూ పవిత్ర శ్రీశైలం దేవస్థానం ఆధ్యాత్మికంగా,సాంస్కృతికంగా అపారమైన ప్రాధాన్యత కలిగిన పవిత్ర స్థలమని అటువంటి గొప్ప ప్రాశస్త్యం కల్గిన దేవస్థాన సమగ్ర అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలు, మరియు భక్తులకు అందించే సేవల మెరుగుదల దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.శ్రీశైలం దేవస్థాన బోర్డులో సభ్యురాలిగా చోటు సంపాదించుకున్న డా సింధు శ్రీ సేవలు ప్రజా హితానికి, మహిళా సాధికారతకు తోడ్పడటమే కాకుండా, శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి దోహదం చేయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి ఫరూక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. అనిల్ కుమార్, డా జగన్ మోహన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.