♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔నాకేం వద్దన్నా….. నీ గెలుపే మాకు ముద్దన్నా
⇔శహబాష్ నాయకులరా…
⇔వీర విధేయులే
⇔పదవి ఇచ్చిన వారికి కృతజ్ఞతగా
సాధారణంగా జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టు కానీ, అధికార పార్టీ నాయకుల సహకారంతో లభించిన పదవీతో సంతృప్తి చెందని నేతలు ఎంతో మంది ఉన్నారు. ఆ పదవి ఎలా వచ్చిందని తెలుసుకోకుండా నాకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ,తనకి పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేలను పక్కకు తోసి తనకు టిక్కెట్ ఇవ్వాలని లేని పక్షంలో రెబల్‌గా మారుతామని హెచ్చరిక చేస్తూ ఎమ్మెల్యేలను హడలెత్తిస్తున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరువురు నేతలకు సొంత బలం అధికంగా ఉన్నప్పటికి అది ఏ మాత్రం దర్పం చూపకుండా తనకు పదవీ ఇప్పించిన నేతలకు కృతజ్ఞతగా ఉండాలని పదవి ఇచ్చిన నాయకుడు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. వీరిద్దరూ వారే .జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. వీరిద్దరూ తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గీసిన లక్ష్మణ రేఖను దాటలేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి నాయకులను ఎన్ని ఎళ్లైనా తమ సహచరులుగా భావించవచ్చని తమకు అవకాశం ఉన్నంతకాలం వారికి ఇప్పటికంటే పెద్ద పదవి ఇప్పించినా ఇబ్బందులు ఉండవని జగన్ సొంత నియోజకవర్గమైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, పాపిరెడ్డి సొంత నియోజకవర్గం అయిన బనగానపల్లెలోని కొలిమిగుండ్ల మండలం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి తల్లిదండ్రులు ప్రజా బలం కలిగిన నేతలే. అయితే ఆ విధంగా ఏ నాడు దర్పం చూపించలేదు. మొత్తం మీద ఎవరైనా నాయకుడి దగ్గర పనిచేసి వారికే టిక్కెట్ వద్దని మొండికేసే సమయంలో వీరిద్దరిని ఉదహారణగా చెప్పుకుంటున్నారు. హుందాగా వ్యవహరిస్తున్న యస్ వి. జగన్ మోహన్ రెడ్డి, పాపిరెడ్డిల మనస్సులు కుడా సున్నితమైనవని ఎవరిని నొప్పించని ఈ ఇద్దర్ని ఆదర్శంగా తీసుకోవాలని కుడా మరికొందరు అనుకుంటున్నారు.